కొనియాడ తరమె నిన్ను
కొనియాడ తరమె నిన్ను కోమల హృదయ
కొనియాడ తరమె నిన్ను
తనరారు దినకరు బెనుతారలనుమించు
ఘనతేజమున నొప్పు కాంతిమంతుడ నీవు
ఖెరుబులు సెరుపులు మరి దూతగణములు
నురుతరంబుగ గొలువ నొప్పు శ్రేష్ఠుడ నీవు
సర్వలోకంబుల బర్వు దేవుడవయ్యు
నుర్వి స్త్రీ గర్భాన నుద్బవించితి నీవు
విశ్వమంతయు నేలు వీరాసనుడవయ్యు
పశ్వాళితొట్టిలో పండియుంటివి నీవు
దోషంబులను మడియు దాసళి కరుణించి
యేసు పేరున జగతి కేగు దెంచితి నీవు
నరులయందున కరుణ ధర సమాధానంబు
చిరకాలమును మహిమ పరగ జేయుదు నీవు
ఓ యేసు పాన్పుగ నా యాత్మ జేకొని శ్రేయముగ పవళించు శ్రీకర వరసుత
Comments
Post a Comment