అమ్మను మించిన ప్రేమనీది
అమ్మను మించిన ప్రేమనీది
రమ్మని చేతులు చాచినది
కమ్మని మాటలతో ఆదరించినది
తన కౌగిలిలో నను దాచినది
అదే అదే నా యేసయ్య ప్రేమ
పదే పదే నను తలచిన ప్రేమ..
మలినమైన నన్ను నీవు
సిలువ పైన కడిగి నావు
బ్రతికించి నావు నీ వాక్కుతో
నడిపించి నావు నీ కరుణతో
మరువగలనా నీ ప్రేమను
విడువ ఇవ్వగలనా నీ స్నేహము
గుండె చెదరి కృంగిన వేళ
అడుగులు తడబడి అలసినవేళ
దర్శించినావు నా యాత్రలో
స్నేహించినావు కాపరిగా
జడియగలనా నా బ్రతుకులో
కలత చెందుదున నా మనస్సులో
నా శత్రువులు నను తరుముచుండగా నాకున్న వారు నన్ను విడిచిపోయిన
నా దాగుచోటుగ నిలిచావు నీవు
ఎత్తయిన కోటగ మలిచావు నన్ను
కదిలింబడుదున నా జీవితంలో
వెనుదిరుగుదునా నా యాత్రలో
Comments
Post a Comment