అదిగో అంజూరము ఓ క్రైస్తవచిగురించెను చూడుము
అదిగో అంజూరము ఓ క్రైస్తవ
చిగురించెను చూడుము.....2
ఇదిగో నేను త్వరగా వత్తును
సిద్ధ పడుడి అను స్వరమును వినవా
"అదిగో"
నూట ఇరువది సంవత్సరములు
చాటెను నోవాహు దేవుని వార్తను
పాటించక ప్రభు మాటలు వారలు "2"
నీటిలో మునిగిరి పాఠము నీకిది
జ్ఞాపకముంచుము లోతు సతీమణి
శాప నగర ప్రియ స్నేహితురాలు
ఆపద నెరిగియు ఆశలు వీడక "2"
నాశనమొండెను పాఠము నీకిది "2"
"అదిగో"
లోకము మోసము రంగుల వలయము
నాశన కూపము నిరతము శోకము
యేసే మార్గము సత్యము జీవము "2"
యేసుని రాజ్యము నిత్యానందము "2"
"అదిగో"
Comments
Post a Comment