కనుగొంటిని నిన్నే ఓ నజరేయ
కనుగొంటిని నిన్నే ఓ నజరేయ సమర్థుడవని సహాయము చేయా (2) నీ ప్రభావము నాలోకి చెరగా (2) నా స్వరూపము మారిపొయేగా (2) ప్రయత్నలు చేసి వెసారియుంటిని ఉన్న ఆస్థి అంత చేజార్చుకుంటిని (2) వైద్యుల చుట్టు కాళ్ళు అరిగెటట్టు (2) ఎంత తిరిగిన సరికాకయుంటిని (2) స్వంత జనులతోనే వెలివేయబడితిని అపనిందలపలై మతి పొయి చెడితిని (2) బ్రతుకెందుకని మనసే చంపుకొంటిని (2) జీవచ్శవమై ఇలా మిగిలియుంటిని (2) నీ మహిమను గూర్చు వార్తలను వింటిని స్వస్థపరచు దేవా నినునమ్ముకుంటిని (2) దైర్యం లేక ఎదురుగ రాలేక (2) వెనుక నుండి వచ్చి నినుముట్టుకుంటిని(2)