Posts

Showing posts from October, 2023

కల్వరి నాధా కరుణించవా

కల్వరి నాధా కరుణించవా  కరుణించి నన్ను కాపాడవా పరమ దయాళి యేసయ్యా  పాప విమోచక యేసయ్యా పరమ పవిత్రుడ యేసయ్యా పరమవైద్యుడా యేసయ్యా శుభములనొసగు శ్రీకరయేసా నీకే ప్రస్తుతి శ్రీ క్రీస్తా దావీదు తనయ దయచూపవా  దయతోడ మమ్ము దరిచేర్చవా దయసాగరా యేసయ్యా  దీనబందు యేసయ్యా పాపుల రక్షక ప్రభుయేసయ్యా  పవిత్రంగా నన్ను పరిహరించవా పరమ దయాళి యేసయ్యా  పాప విమోచక యేసయ్యా

సృష్టికర్తవైన యెహోవా

సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పనియైన నాపై ఎందుకింత ప్రేమ మంటికి రూపమిచ్చినావు  మహిమలో స్థానమిచ్చినావు నాలో నిన్ను చూసావు నీలో నన్ను దాచావు  నిస్వార్ధమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ  ఏ కాంతిలేని నిశిధిలో ఏ తోడు లేని విషాదపు విధులలో  ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్నాతండ్రివి (2) యేసయ్యా నను అనాధగ విడువక నీలాంజనములతో నాకు  పునాదులు వేసితివి (2) నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నను దినమెల్ల వేదించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్నాకర్షించిన ప్రేమ మూర్తివి (2) యేసయ్యా నను కృపతో బలపరచి  ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి

CHRISTMAS EDHI CHRISTMAS CHRISTHU ARAADHANA,క్రిస్మస్ ఇది క్రిస్మస్ క్రీస్తూ ఆరాధన

గగనమంత వెలిగింది గొప్ప వెలుగులతో భువి అంత పాడింది ప్రభు పాటలను    క్రిస్మస్ ఇది క్రిస్మస్ క్రీస్తు ఆరాధన క్రిస్మస్ నిజ క్రిస్మస్ క్రీస్తు ఆలాపనా వింతైన తారక వెలసింది ఆ గగనాన ఇలలోన యేసుని చూపింది ఈభువిలోన ఆకాశమందున తారలెన్నియున్నను } ఈ తార వింతైనది                         } వెలుగుచుండెను దారి చూపుచుండెను జ్ఞానులను నడుపుచుండెనే         }  ° 2 " యేసుపుట్టెను పశుల పాకలో       } బెత్లెహేముకు తరలి రండని         }  ° 2 " ముందుగా ముందుగా నడచుచుండెనే     "  2  " వింతైన తారక వెలసింది ఆ గగనాన  ఇలలోన యేసుని చూపింది ఈ భువిలోన      "  2  " దూత తెల్పెను శుభవార్తను      } రక్షకుడు పుట్టాడని        ...

EDHINAM SHUBHA DHINAM,ఈ దినం శుభ దినం

ఈ దినం శుభ దినం ఈ లోకానికే పర్వ దినం ప్రకృతి పరవసించెను ప్రతి హృదయము పులకించెను శుభం శుభం నీకు శుభం ఈ లోకానికే శుభ దినం రాజుల రాజుగా ప్రభు యేసు జన్మించెను తన ప్రజల వారి పాపము నుండి విడిపించి రక్షింపను   "  ఈ దినం  " మహిమా స్వరూపుడు క్రీస్తుగా జన్మించెను నిత్య జీవమును  శాశ్వత ప్రేమను సమాధాన మిచ్ఛుటకు                             "  ఈ దినం  " శ్రీమంతుడైన దేవుడు దీనునిగా జన్మించెను దీనులను ధన్యులను చేసి ఆశీర్వదించుటకు        "  ఈ దినం  "   🎼 రచన , స్వర కల్పన , గానం 🎼          Bro's  శ్యాంసన్ ,  స్టాలిన్               S S Brother's               9505580269

శాశ్వతం కాదేది ఇలలో ఏదైనా

శాశ్వతం కాదేది ఇలలో ఏదైనా తెలుసుకున్నానయా ఇప్పుడే యేసయ్యా నీ ప్రేమయే శాశ్వతము నిరతము నన్ను నడుపునది నీ ప్రేమయే నీ కృపయే చాలు నాకు యేసయ్యా ఓడిపోయిన నా బ్రతుకులో  జయమునిచ్చినది నీ కృపయే కృంగియున్న నా బ్రతుకును  బలపరిచినది నీ కృపయే  నీ కృపయే నీ కృపయే చాలు నాకు యేసయ్యా మోడుబారిన నా జీవితమును  చిగురింప చేసినది నీ కృపయే నిష్పలమైన నా జీవితమును  ఫలియింప చేసినది నీ కృపయే  నీ కృపయే నీ కృపయే చాలు నాకు యేసయ్యా           రచన & స్వర కల్పన            శ్యాంసన్ & స్టాలిన్              9505580269

కృపా సత్య సంపూర్ణుడా

కృపా సత్య సంపూర్ణుడా క్షమా ప్రేమ పరిపూర్ణుడా కృప కృప కృప కృప నీ కృపా దయా          ద యా దయా దయా- నీ దయా కృప వెంబడి కృపను చూపించితివే నీ కృపలో బహుగా దీవించితివే కృప నా అపరాధము చేత నే  చచ్చియుండగా క్రీస్తుతో కూడ నన్ను బ్రతికించితివే పరదేశినై నే పడియుండగా పరిశుద్ధుల యింటిలో నను చేర్చితివే ఈ లోక ప్రేమ అంత వ్యర్ధమైనది నీ పరిపూర్ణమైన ప్రేమ చాలును దేవా           రచన & స్వర కల్పన            శ్యాంసన్ & స్టాలిన్              9505580269

కూర్చుందును నీ సన్నిధిలో

కూర్చుందును నీ  సన్నిధిలో   దేవా  ప్రతి  దినం ధ్యానింతును నీ  వాక్యమును   దేవా  ప్రతి  క్షణం |2| నిరంతరం నీ  నామమునే గానము చేసెదను ప్రతిక్షణం నీ  సన్నిధినే అనుభవించెదను ||కూర్చుందును నీ  సన్నిధిలో|| ప్రతి విషయం నీకర్పించెద నీ  చిత్తముకై  నే  వేచెద  |2| నీ  స్ఫూర్తినే  పొంది  నే  సాగెద|2|  నీ  నామమునే  హెచ్చించెద |2| నా అతిశయము  నీవే నా  ఆశ్రయము  నీవే నా  ఆనందము  నీవే,  నా  ఆధారము నీవే యేసు  యేసు,  యేసు  యేసు  ప్రతి దినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపము వెలిగించెద |2| నీ వాక్యానుసారము జీవించెద |2|   నీ ఘన కీర్తిని వివరించెద |2| నా దుర్గము నీవే, నా ధ్వజము నీవే నా ధైర్యము నీవే, నా దర్శనం నీవే యేసు  యేసు,  యేసు  యేసు 

కొరుకున్న చెలిమి దొరికెను

కొరుకున్న చెలిమి దొరికెను (పొందెను) కలనైన ఎన్నాడు విడువకు (మరువకు) ఈ సమయం నీదే చేరుమా వెచియున్నది నీ బంధము కలలకంటివి నీ ప్రియుని కొసమో నీ కొరకై నిలుచుండెను (వేచియుండేను) ఒకసారి ఇటూచూడుమా ఈ సమయం నీదే చేరుమా వెచియున్నది నీ బంధము మరచిపొకుమా ఇది ప్రభుని కార్యము ప్రేమించి దీవించేను (చూపించేను) నీ ఆశను తీర్చేను ఈ సమయం నీదే చేరుమా వెచియున్నది నీ బంధము