Posts

Showing posts from May, 2021

అమ్మను మించిన ప్రేమనీది

అమ్మను మించిన ప్రేమనీది రమ్మని చేతులు చాచినది కమ్మని మాటలతో ఆదరించినది తన కౌగిలిలో నను దాచినది అదే అదే నా యేసయ్య ప్రేమ పదే పదే నను తలచిన ప్రేమ.. మలినమైన నన్ను నీవు సిలువ పైన కడిగి నావు బ్రతికించి నావు నీ వాక్కుతో నడిపించి నావు నీ కరుణతో మరువగలనా నీ ప్రేమను విడువ ఇవ్వగలనా నీ స్నేహము గుండె చెదరి కృంగిన వేళ అడుగులు తడబడి అలసినవేళ దర్శించినావు నా యాత్రలో స్నేహించినావు కాపరిగా జడియగలనా నా బ్రతుకులో కలత చెందుదున నా మనస్సులో నా శత్రువులు నను తరుముచుండగా నాకున్న వారు నన్ను విడిచిపోయిన నా దాగుచోటుగ నిలిచావు నీవు ఎత్తయిన కోటగ మలిచావు నన్ను కదిలింబడుదున నా జీవితంలో వెనుదిరుగుదునా నా యాత్రలో

కల్వరి సిలువలో యేసయ్య నీ రక్తమే

కల్వరి సిలువలో – యేసయ్య నీ రక్తమే (2) క్షమియించెను పాపము కడిగె – యేసయ్య నీ రక్తమే పరిశుద్ధులుగా మము చేసెను – యేసయ్య నీ రక్తమే కలుషములను కడిగేను – యేసయ్య నీ రక్తమే కలవరము బాపెను – యేసయ్య నీ రక్తమే సీయోనును మేము చేర్చెను – యేసయ్య నీ రక్తమే (2) నీ రక్తమే – నీ రక్తమే నీ రక్తమే – యేసు నీ రక్తమే విడుదలను దయచేసెను – యేసయ్య నీ రక్తమే విజయమును చేకూర్చెను – యేసయ్య నీ రక్తమే శిక్షంతటిని తొలగించెను – యేసయ్య నీ రక్తమే (2) నీ రక్తమే – నీ రక్తమే నీ రక్తమే – యేసు నీ రక్తమే వేదనను మాన్పెను – యేసయ్య నీ రక్తమే ఓదార్పు మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే శాశ్వత జీవం మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే (2) నీ రక్తమే – నీ రక్తమే నీ రక్తమే – యేసు నీ రక్తమే అర్హతను మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే ఆనందముతో నింపెను – యేసయ్య నీ రక్తమే ఆశీర్వాదం మాకొసగెను – యేసయ్య నీ రక్తమే (2) నీ రక్తమే – నీ రక్తమే నీ రక్తమే – యేసు నీ రక్తమే (2)

కష్టాలు కన్నీళ్లు కలకాలం

కష్టాలు కన్నీళ్లు  కలకాలం నీ తోడు ఉండబోవమ్మా             కరుణించు నా యేసు వెన్నంటి నీ తోడు నిలుచును ఓ అమ్మ       |2|  నిను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన                |2|  య్యేస్సయ్యా ఎన్నడు నీ చేయి విడువడు   కష్టాలు కన్నీళ్లు  కలకాలం నీ తోడు ఉండబోవమ్మా  కరుణించు నా యేసు వెన్నంటి నీ తోడు నిలుచును ఓ అమ్మ 1. ప్రేమించానని ప్రాణమే నీవని నీవులేని జీవితం ఊహించలేనని  చెప్పినవారే మోసంచేసి ఎదలో గాయం మిగిల్చిన   నిను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన                |2|  య్యేస్సయ్యా ఎన్నడు నీ చేయి విడువడు   కష్టాలు కన్నీళ్లు  కలకాలం నీ తోడు ఉండబోవమ్మా  కరుణించు నా యేసు వెన్నంటి నీ తోడు నిలుచును ఓ అమ్మ 2. స్నేహమే జీవితం స్నేహమే శాశ్వతం  స్నేహమే సర్వమని నీవే నా స్నేహమని  అని చెప్పినవారే ఒంటరిచేసి ఎదలో గాయం మిగిల్చిన  నిను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన      ...

క్షణమైనా గడువదు తండ్రీ నీ కృప లేకుండా

క్షణమైనా గడువదు తండ్రీ నీ కృప లేకుండా నీ కృప లేకుండా ఏ ప్రాణం నిలువదు ప్రభువా నీదయ లేకుండా  నీ దయ లేకుండా      ||2||  నీవే నా ప్రాణం నీవే నా ధ్యానం  నీవే నా సర్వం యేసు ....||2|| ||క్షణమైనా||  ఇంత కాలం లోకంలో బ్రతికా జీవితం అంతా వ్యర్దం చేసా తెలుసుకున్నాను నీవు లేని జీవితం వ్యర్దం అనీ అనుభవించాను  నీ సన్నిధిలో అనందమని ||2|| ||నీవే||  పనిలో ఉన్నా ఎందరిలో ఉన్నా ఎక్కడ ఉన్నా నేనేమై వున్నా నీవు నా చెంత ఉంటేనే నాకు చాలయ్య నీ రెక్కలే నాకు ఆశ్రయం నా యేసయ్యా ||2|| ||నీవే||  జ్ఞానమున్నా పదవులెన్నున్నా దనము ఉన్నా సర్వం నాకున్నా నీవు నాతో లేకుంటే అంత శున్యమేగా పరలోక స్వాస్థ్యము ఎల్లపుడూ శ్రేష్టమెగా ||2|| ||నీవే|| ||క్షణమైనా||

క్రొత్త సంవత్సరం వచ్చింది

క్రొత్త సంవత్సరం వచ్చింది క్రొత్త వాగ్దానము తెచ్చింది క్రొత్త సంవత్సరం వచ్చింది క్రొత్త ఆశలను తెచ్చింది యేసయ్య ఇచ్చిన క్రొత్త సంవత్సరం యేసయ్య ఇచ్చిన మహిమ సంవత్సరం Happy Happy Happy New Year పాతవి గతియించేను సమస్తము క్రొత్తవాయెను చీకటి తొలగిపోయెను చిరు దీపము నాలో  వెలిగేను చీకటి పోయెను వెలుగు కలిగెను పాతవి పోయెను క్రొత్తవి ఆయెను                    "   Happy   " ప్రకృతి పరవశించేను ప్రతి దినము ఆనందించేను పరము నుండి ఆశీర్వాదమే భువిపైకి దిగి వచ్చెను ఆనందం కలిగెను ఆశీర్వదించెను వాగ్దానమిచ్చేను వరములు తెచ్చేను                       "  Happy" నూతన వాగ్ధానమే దేవుడు మనకిచ్చెను నూతన  నీరీక్షణ నాలో కలిగించెను సంతోషం కలిగెను సమాదానం నిండెను ఆనందం కలిగెను ఆశీర్వాదం వచ్చెను              ...

క్రీస్తునే వేదకు క్రీస్తులోనే బ్రతుకు

క్రీస్తునే వేదకు క్రీస్తులోనే బ్రతుకు క్రీస్తులో ఎదుగు క్రీస్తేసే వెలుగు "2"                         గాఢాందకారాన పయనించినా శోధన బాధలు వెన్నంటినా........  వెలిగించుకో నిన్ను వేతలందునా బలమైన ప్రభుయేసు పథమందునా పరదైసులో నీకు పాలుండునూ "2" మరి ఏల? ఈ జాగు ఓ సోదరా!                      ఇహలోక మోహాలు బంధించినా ఈ లోక వాంఛలు వంచించినా   పరలోక ఆ ప్రేమ సామ్రాజ్యము అనిపించు ప్రభుయేసు కడనుండినా కరుణించి కాపాడి దరిచేర్చునూ "2" మరి ఏల? ఈ బాగు ఓ సోదరీ!                          ఏ కారు చీకటుల సంధించినా ఏ దాహ బాధలు నీ కుండవు నీ పాప భారాన్ని తను మోసెను తన రాజ్యభాగ్యాన్ని అందించెను నీ చింతలన్ని తను తీర్చెను   "2" మరి ఏల? ఈ బాగు ఓ నేస్తమా!                                

క్రిస్మస్ కాలం క్రీస్తుజననం

క్రిస్మస్ కాలం క్రీస్తుజననం ఎంతో.. ఆనందమే రాజాధిరాజు..  ప్రభువుల ప్రభువు..ఈ ధరకేతెంచెలే -2 ఎంతో ఆనందమే…. రారాజు నీ జన్మమే ఎంతోసంతోషమే ఆ ప్రభుని ఆగమనమే  | క్రిస్మస్ కాలం |  పరిశుధ్ధుడు జన్మించెను –  పశువుల పాకలో లోకాల నేలే రారాజుగా  ఆ బెత్లేహేములో -2 యూదా గోత్రములో.. ఒకతార కాంతిలో -2 | క్రిస్మస్ కాలం| కాపరులు చాటించిరి – లోకాన శుభవార్తను బంగారు ,సాంబ్రాణి, బోళములు అర్పించిరీ జ్ఙానులు -2 దూతలు స్త్రోత్రించిరి.. ఆ ప్రభుని ఘనపరచిరి -2  | క్రిస్మస్ కాలం|  ఆ ప్రభువు జన్మించెను నరరూపధారిగా మనపాప పరిహర బలియార్ధమై గొఱ్ఱేపిల్లగా ఆ ప్రభువు జన్మించెను నరరూపధారిగా మన పాపాన్ని తొలగించి రక్షింపగా మరియ సుతునిగా -2 ఎంతో ఆనందమే…. రారాజు నీ జన్మమే ఎంతో సంతోషమే.. ఆప్రభుని ఆగమనమే -2  |క్రిస్మస్ కాలం|

క్రిస్మస్ ఆనందం సంతొషమే

క్రిస్మస్ ఆనందం సంతొషమే నా యేసునీ జన్మదినమే యూదుల రాజుగ జన్మించేనే పశులతొట్టెలొ పరుండబెట్టెనే (2) క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్ – క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్ – క్రిస్మస్ మెర్రి క్రిస్మస్  |క్రిస్మస్ ఆనందం|  సంతొషం సంభరం రాజులకు రాజు పుట్టెను ఆనందం మనకు అనుదినం ఇక ఇమ్మానుయేలు వచ్చెను క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్ – క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్ – క్రిస్మస్ మెర్రి క్రిస్మస్  |క్రిస్మస్ ఆనందం|  గొల్లలు జ్ఞానులు దర్శించి పూజించిరి విలువైన కానుకలను అర్పించి ప్రణమిల్లిరి క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్ – క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్ – క్రిస్మస్ మెర్రి క్రిస్మస్  |క్రిస్మస్ ఆనందం|  ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమధాన కర్త ఇమ్మనుయేలు యేసుడు  క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్ – క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ క్రిస్మస్ హ్యపీ క్రిస్మస్ – క్రిస్మస్ మెర్రి క్రిస్మస్  |క్రిస్మస్ ఆనందం|

కోరితినీ ప్రభూ వేడితినీ ప్రభూ

కోరితినీ ప్రభూ వేడితినీ ప్రభూ చేరితినీ ప్రభు నీ సన్నిది నా దాగు చోటువు నీవేనని ఆశ్రయ పురము నీవేనని యేసురాజా నా యేసురాజా యేసురాజా నా ప్రాణనాధా 1. ఆపధకాలమున ఆదుకొంటివి     అన్ని అక్కరలు తీర్చుచుంటివి     కొదువే లేదు నీదు ఒడిలో     కురిపించితివీ నీ కృపను 2. శ్రమ కాలమున చెంత చేరితివి     శ్రమలో విడిపించి గొప్ప చేసితివి     నీ రక్షణను చూపించితివి     దీర్ఝాయువును నాకు ఇచ్చితివి                       TRACK https://youtu.be/-1YSqv18ZW4        రచన , స్వరకల్పన        శ్యాంసన్ & స్టాలిన్         9505580269

కొనియాడబడును

కొనియాడబడును యెహోవాయందు  భయభక్తులు గల వనిత తనవారికైనా పగవారికైనా  పంచును సమత మమత ప్రతి పరిస్థితిని ప్రేమతో భరించగలిగిన ఓర్పు ప్రతికూలతను అనుకూలముగా మార్చేటి నేర్పు కలిగిన భార్య ఇంటికే దీపము సంఘమనే ఆ వధువునకు  నిజమైన రూపము తండ్రివలె ఓదార్చి తల్లివలె 'సేదదీర్చి మిత్రునివలె భర్తకు ఎప్పుడు తోడుగ ద్తేవజ్ఞానముతో  కుటుంబమును నడుపును రాబోవు వాటి గూర్చి  నిశ్చింతగా నుండును బ్రతుకు దినములన్నియును  భర్తకు మేలే చేయును దీనులకు దరిద్రులకు  తన చేయిచాపును ఆహారమును తానే సిద్దపరచును ఇంటి వారినందరిని  కని పెట్టుచుండును

కొనియాడ తరమె నిన్ను

కొనియాడ తరమె నిన్ను కోమల హృదయ కొనియాడ తరమె నిన్ను తనరారు దినకరు బెనుతారలనుమించు ఘనతేజమున నొప్పు కాంతిమంతుడ నీవు ఖెరుబులు సెరుపులు మరి దూతగణములు నురుతరంబుగ గొలువ నొప్పు శ్రేష్ఠుడ నీవు సర్వలోకంబుల బర్వు దేవుడవయ్యు నుర్వి స్త్రీ గర్భాన నుద్బవించితి నీవు విశ్వమంతయు నేలు వీరాసనుడవయ్యు పశ్వాళితొట్టిలో పండియుంటివి నీవు దోషంబులను మడియు దాసళి కరుణించి యేసు పేరున జగతి కేగు దెంచితి నీవు నరులయందున కరుణ ధర సమాధానంబు చిరకాలమును మహిమ పరగ జేయుదు నీవు ఓ యేసు పాన్పుగ నా యాత్మ జేకొని శ్రేయముగ పవళించు శ్రీకర వరసుత

కొంతసేపు కనబడి

కొంతసేపు కనబడి  అంతలోనే మాయమయ్యే ఆవిరివంటిదిరా ఈ జీవితం లోకానకాదేదీ శాశ్వతం ఎదురౌతారెందరో నీ పయనంలో నిలిచేది ఎందరు నీ అక్కలో వచ్చేదెవరు నీతో మరణము వరకు ఇచ్చేదెవరు ఆపై నిత్యజీవము నీకు చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగునో యోచించితివా నీ శాపం తాను మోసి పాపం తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా

కొండ కోన లోయలోతుల్లో

కొండ కోన లోయలోతుల్లో… ఓ ఓ వినబడుతుంది నా యేసుని స్వరమే తెలుసుకో నేస్తమా యేసే నిజ దైవం ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం                             || కొండ కోన || నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసు హృదయమందు చేర్చుకో నేస్తమా (2) ఏ స్థితికైనా చాలిన దేవుడు నా యేసేనయ్య నీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్య (2) నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2)                                  ||కొండ కోన || ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడెను నా యేసు నిన్ను రక్షించాలని (2) కలువరి సిలువలో తన రక్తమును కార్చెను యేసయ్య తన రాజ్యములో నిను చేర్చుటకు పిలిచెను యేసయ్య (2) నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2)                                   ||కొండ కోన ||

కృపాసత్య సంపూర్ణుడా

కృపాసత్య సంపూర్ణుడా పరలోక అధిపతి నిత్యుడగు యేసయ్యా  " 2 " సృష్టికర్త ప్రభు యెహోవా సర్వశక్తి మంతుడవు      " 2 " ఉన్నవాడవు అనువాడవు  రక్షణ ఆశ్రయ దుర్గం   " 2 " ఆరాధనా మహిమ ఆరాధనా ఘనత ఆరాధనా ఆమెన్ ఆరాధనా ఆమెన్                                  " కృపాసత్య " యెహోవా నా కాపరి  యెహోవా మనకు శాంతి     " 2 " మహిమ గల దేవుడువు యెహోవా నీతి సూర్యుడు " 2 " ఆరాధనా మహిమ ఆరాధనా ఘనత ఆరాధనా ఆమెన్ ఆరాధనా ఆమెన్                                   కృపాసత్య

కృపలో జీవించాలని

కృపలో జీవించాలని ఆ కృపలోనే మరణించాలని ఆశ ఉన్న ప్రాణాన్ని  తృప్తి పరచుమో దేవా తృప్తి పరచుమో దేవా నిందించు వారు నా వారై  ఓదార్చు వారు కనుమరు!గై పోయిరి కృప అన్నది నాతో- ఓదార్పు నేనని కృప అన్నది నాతో- ఆధరణ నేనని ఏమిలేని నాకు అన్ని నీవైనావు నీతో నేనుండుటకు నన్నెన్ను కొన్నావు కృపలో జీవించి ఆ కృపలో కొనసాగి కృపలో మరణించె ఆ కృప నిమ్మయ్యా

కృపతో రక్షించిన నా యేసయ్య

కృపతో రక్షించిన నా యేసయ్య నీ కృపలోనే జీవించే వరము నియ్యవా నీకృపయే బలహీనతలను మాన్పెను " 2 " ఆ కృప పరిపూర్ణతకు దారి చూపెను " 2 " నీ కృపా  నీ కృపా నీ కృపా నీ కృపా " 2 " ఎక్కడో పడివున్న నన్ను  వెదకి వచ్చినది నీ కృపా నిరీక్షణే లేని నాకు  గమ్యము చూపించినది నీకృపా          " 2 " నను విడిపించేను నిత్య జీవమిచ్చును " 2 " జయ జీవితమునకే అభిషేకమిచ్చెను   " 2 " రోగ శయ్య మీద నున్ను  నన్ను తేరి  చూసినది నీ కృపా గాయముల భరించి  సంపూర్ణ స్వస్థత ఇచ్చినది నీకృపా      "2" నను లేవ నెత్తేను గొప్ప ధైర్యమిచ్చెను "2" తన సాక్షిగా నిలుపుటకే నన్ను పంపెను "2"  అప్పులలో కూరుకున్న నాకు  చేయి నిచ్చినది నీకృపా దరిద్రత భరించె నన్ను ఆశీర్వాదముగా మార్చే నీకృపా       " 2 " తలగా యేంచేను పైవానిగుంచేను    " 2 " నా పాదముంచు ప్రతి చోటును  ఆశీర్వదించేను                                " 2 "

కృప వెంబడి కృపతో

కృప వెంబడి కృపతో  నను ప్రేమించిన నా యేసయ్యా  నను ప్రేమించిన నా యేసయ్యా  నను కరుణించిన నా యేసయ్యా  నాయడల నీకున్నా తలంపూలు బహూ  విస్తారముగ ఉన్నవి నీలోదేవా  అవివర్ణించలేను నా యేసయ్యా  అవి వివరించలేను నా యేసయ్యా  నాయడల నీకున్నా వాంఛలన్నియు  ఎన్నోదినములు నిన్ను నే విడడచితిని  ఎన్నోదినములు నిన్ను నే మరచితిని విడవని యడబాయని నా యేసయ్యా  మరువక నను ప్రేమించిన నా యేసయ్యా  ఎమిచ్చి నిరుణము తిర్చిదనయ్యా

కృంగిపోకు నేస్తమా

కృంగిపోకు నేస్తమా  మంచిరోజు నీకుంది సుమా మారదీ తలరాతని మనసు రానీకుమా మంచిరోజులోస్తాయమ్మా మరువనీడు నీదేవుడమ్మా ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా తన ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా                                                  ॥కృంగిపోకు॥             1॰ శూన్యమైన సృష్ఠినే చూడకుండెనా ఆకారం లేనిదనీ ఆదమరిచెనా చీకటి కమ్మెననీ చూడకుండెనా వెలుగు కలుగుగాక అనీ పలుకకుండెనా మరిచెనా లేక మంచిదిగా మలిచెనా ॥2॥ మరచునా నీకు మంచి చేయకుండునా ॥2॥ అందుకే                                   ॥కృంగిపోకు॥              2॰ యేసేపు అన్నలే తోసేసినా బాషరాని దేశానికి అమ్మేసినా బానిసైన బాధ్యతగా పనిచేసినా బాధితునిగా చేసి బంధించినా మరిచెనా లేక మంత్రినే చేసెనా ॥2॥ మరచునా నీకు మంచి చేయకుండునా ॥2॥ అందుకే            ...

కులపిచ్చోన్ని నేను

కులపిచ్చోన్ని నేను కళ్ళు లేని కబోదిని మత పిచ్చోన్ని నేను మతిలేని ఉన్నా వాదిని ప్రభుదేవా పరలోక రాజా నీ రాజ్యములో నన్ను చేర్చుదేవా నా కులం నా మనసు విరిచిందిలే కులమేుక కల్పనయే - మతమేుక మతి బ్రామయే కుల వేలి మత బలి- మోసం మోసమేలే నాఅంశం నా కులం తప్పిందిలే-  నా వంశం నా మతం మరిచిందిలే పుట్టక లో లేని కులం బ్రతుకులో ఎందుకులే మరణంలో రాని మతం-  మోక్షంలోలేదులే ||కులపిచ్చోన్ని||

కురిసెను ఆనందాలు

కురిసెను ఆనందాలు -  జత కలిసెను అనుబంధాలై  ఇది దేవుని కార్యం - శుభ తరుణం " 2 " సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను   దేవుడే  చేసెను - జతపరచి దీవించెను " 2 " వివాహము అన్నిటిలో - ఘనమైన బంధం  నిలిచిపోవాలి ఎన్నటికి - ఈ బంధం " 2 "    " కురిసెను " యేసు మీ  గృహమును  - కట్టెను స్థిరముగా  క్రీస్తే యజమానిగా - పాలించును ప్రభువుగా " 2 " ఒకరికి ఒకరు తోడై -  ఐక్యమవ్వాలి క్రీస్తులో  ప్రేమ భక్తి కలిగి - జీవించాలి   " 2 " " కురిసెను "

కురిసింది నవ్వుల వాన

కురిసింది నవ్వుల వాన వివాహశుభ సమయాన  నాలో కలిగే సందండి నాలో కలిగే సవ్వడి  హృదయాలు స్పందించే వేళ యీ వేళ కోయిలమ్మా పాడే కమ్మనైన ఏదో రాగం దాగినమ్మా సిగ్గు తొందరళ్ళో ఏదో భావం ఒంటరి జీవితం జంటగా మార్చెనే ఇరుహృదయాలను ఒకటి కూర్చెనే దేవుడేకలిపిన బంధం వీడిపోని ఆనుబంధం గొరుమామిడమ్మా పుసేనమ్మా ఆనురాగం మరువకూడదమ్మా  చేసుకున్న ఈ ప్రమాణం వాక్యపు వెలుగులో  బ్రతుకులు పండగా దేవుడే తోడుగా మితో ఉండగా దేవుడే కలిపిన బంధం వీడిపోని ఆనుబంధం

కుమ్మరి చేతిలో మంటివలే

కుమ్మరి చేతిలో మంటివలే తల్లివడిలో పసి బిడ్డవలె అయ్యా నీ కృపతో నన్నుమార్చుము యేసయ్యా నీ పొలికగా నన్ను దిద్దుము నాలోని స్వయమును నలుగ గొట్టుము నాలోని వంకరలు చక్కగా చేయుము నీ పొలిక వచ్చే వరకు నా చేయ్యీ విడువకు సారె పైనుండి తీసివేయకు నాలోని అహామును పారద్రోలుము నాలోనీ తొందరలు తీసివేయుము నీ భుజముపై అనుకొనే బిడ్డగా మార్చుము నీ చేతితో నడిపించుము

కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి

కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా ఆ ఆ ఆ చల్లగ చూడుమయ్యా పనికిరాని పాత్రనని – పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా ||2|| సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండ సాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి ఆ ఆ ఆ సత్యముతో నింపుము తండ్రి  ||కుమ్మరి||  విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరు వెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి (2) ఆటంకములనుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు కావుమయ్యా పగిలియున్న పాత్రను నేను – సరిచేసి వాడుమయ్యా ఆ ఆ ఆ సరిచేసి వాడుమయ్యా  ||కుమ్మరి||  లోకాశతో నిండి ఉప్పొంగుచూ – మార్గంబు నే దప్పితిన్ మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే – మనశ్శాంతి కోల్పోతిని (2) పోగొట్టుకున్న పాత్రయనుచు – పరుగెత్తి నను పట్టితివి ప్రాణంబు నాలో ఉన్నప్పుడే – నీ పాదంబుల్ పట్టితిన్ ఆ ఆ ఆ నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||

కీర్తించి కొనియాడి ఘనపరతును

కీర్తించి కొనియాడి ఘనపరతును స్తోత్రించి స్తుతియించి  నినుపాడెదన్ (2)            యేసయ్య హల్లెలూయా        నాయేసయ్య హల్లెలూయా (2)            ఆరాధన స్తుతిఆరాధన            ఆరాధన ఘనఆరాధన (2) 1.దేవాదిదేవుడవు పరలోకమును వీడి    మానవరూపాన్ని ధరియించినావు (2)    రాజులకురాజువు     ప్రభువులకు ప్రభుడవు నీవే మారక్షణ విమోచకుడ (2)            యేసయ్య హల్లెలూయా         నాయేసయ్య హల్లెలూయా(2)            ఆరాధన స్తుతిఆరాధన            ఆరాధన ఘనఆరాధన (2)  2.మమ్మెంతగానో ప్రేమించినావు      నీప్రాణములనే అర్పించినావు (2)       మాప్రాణనాధుడవు      ఆధారభూతుడవు  నీవే మారక్షణ విమోచకుడ (2)            యేసయ్య హల్లెలూయా          నాయేసయ్య హల్లెలూయా (2)   ...

కీర్తనీయుడు నాయేసురాజు

కీర్తనీయుడు నాయేసురాజు  నన్ను విడువని దేవుడు              (2) ఆత్మ రూపుడు ఆరాదనీయుడు  అది అంతము నా యేసుడు       (2) ఎర్ర సంద్రము పాయాలు చేసి మా పితరులను నడిపించినావు    (2) రాజుల రాజా నీవే సారాదిగ          (2) శత్రు సెనలను హత మార్చినావు    (2) మహానీయుడా మా విజయము నీవే మహోన్నత మా బలము నీవే         (2) ఆకాశము నుండి ఆహరమిచ్చి బండను చీల్చీ జలధారలిచ్చి         (2) అనుదినం మా జీవహారమై            (2) మాలో ప్రవహించు జీవనదివై         (2) సజీవుడా మా జీవము నీవే సర్వోన్నత మా సర్వము నీవే         (2) సుర్య చంద్రులను అపిన దేవా సర్వ సృష్టికి శాసనకర్త                   (2) సహన మూర్తివై సాత్వీకుడవై         (2) సిలువలో మాకై మరణించినావు     (2) ప్రేమమయ నీ ప్రేమా మధురం  కృపమయా న...

కాలలు మారిన కన్నీరే మిగిలినా

కాలలు మారిన కన్నీరే మిగిలినా మారని దేవుడు నిను మరువడేన్నడు కష్టాలే కలిగినా హృదయమెంతో నలిగిన కాపాడు దేవుడు నీతోనే ఉన్నాడు "2" యేసయ్యి....... యేసయ్యా........ యేసయ్యా....... యేసయ్యా....... "2"                        " కాలలు మారిని "                   అవమానములెన్నెన్నో తరుముచుండగా నిందలెన్నో నన్ను కృంగదీయగా   "2" నా చేయి పట్టి లేవనేత్తినావు నీ సన్నిధానములో నిలువబెట్టినావు "2"                          " యేసయ్యా "                   ఇంతకాలము నన్ను పోషించితివే నీ రెక్కల నీడలో నన్ను దాచివావే "2" రానున్న కాలమంతా కృపాక్షేమము దయచేయుచూ కరుణాసంపన్నుడా "2"                           " యేసయ్యా "                   ఆ మహిమ రాజ్యములో చేరాలని యుగయుగాలు నీలోనే పరవశించాలని "2" ఆశతో...

కాలమునేరిగి నిదుర మేలుకో

కాలమునేరిగి నిదుర మేలుకో భారము కలిగి బ్రతుకు దిద్దుకో-2 దీపము ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో దేహము ఉండగానే దేవుని మనసు    తెలుసుకో... ఇదే కదా అనుకూల సమయం సోదరా మరో దినం నీకు ఉందో లేదో ఎరగరా....  కాలం ఎరిగి నిదుర మేలుకో భారం కలిగి బ్రతుకు దిద్దుకో... 1) నేడు నీతోఉందిలే రేపునీది కాదులే  ఉన్న సమయం మందే నిన్ను నీవు తెలుసుకో... లోకం ఎంతో ఉందిలే నిన్ను పిలుస్తుందిలే  ఎండమావి నిజమా ఎరిగి నీవు మసులుకో....ఆ.... ఆ.... ఆ 2  కంటికింపుగా కనిపించే రంగుల వలయం కదా సొంత గూటినే మరిపించే దేవునికి దూరం చేస్తుందా... 2) శరీరాశ పుట్టగా లొంగి పోకు సులువుగా పాపమంటే పామే.. కాటు వేస్తుందిగా దేహమందు మంచిగా ఉన్నదేదీ లేదుగా  అవయవాల దాహం తీర్చు సాధ్యపడదుగా ఆ.... ఆ.... ఆ.... 2  శరీరాన్ని పాపం ఎేలితే నరకంలో ఆత్మకు బాధ   నితి సాధనాలుగా దేవునికి కప్పగిస్తే నేకదా మరియాద....

కాచెను నను నీ కృప దాచేను నను నీలో

కాచెను నను నీ కృప దాచేను నను నీలో కొదువలేదు కొరత లేదు నీకృపయే నాకు చాలును యేసయ్యా నా యేసయ్యా నీ కృపయే నాకు చాలునయ్యా యోగ్యాతే లేని నన్ను యోగ్యుని చేసింది నీ కృప అర్హత లేని నన్ను అర్హుని చేసింది నీ కృప హస్తముచాపి ననుబలపరచి స్థిరపరచినది నీకృప పాపపు ఊబిలో నుండి పైకి లేపింది నీ కృప కలువరి రక్తముతో నన్ను శుద్ధుని చేసింది నీ కృప హస్తముచాపి నను బలపరచి రక్షణనిచ్చినది నీకృప ఆదారనే నాకు లేనపుడు ఆదారించినది నీకృప అప్తులే నా చేయ్యీ విడువగా విడువలేదే నీకృప హస్తము చాపి భుజమును తట్టి బలపరచినది నీ కృప           రచన స్వర కల్పన గానం            శ్యాంసన్ & స్టాలిన్              9505580269

కళ్ళల్లో కన్నీరు ఎందుకూ

కళ్ళల్లో కన్నీరు ఎందుకూ  గుండెల్లో దిగులు ఎందుకు  ఇక నీవు కలతచెందకూ నెమ్మది లేకున్నదా  గుండెల్లో గాయమైనద  ఇక అవి ఉండబోవుగా యేసే నీ రక్షణ యేసే నీ నిరీక్షణ   యేసే నీ రక్షణ యేసే నీ నిరీక్షణ                                                                                                                    హొరు గాలులు వీచగ తుఫానులు చెలరెగగా మాట మాత్రం సెలవియ్యగ నిమ్మళమాయెనుగా  యేసే నీ నావిక  భయము చెందకూ నీవు ఇక యేసే నీ రక్షక - కలత చెందకు నీవు ఇక                                                                ...

కళ్యాణ రాగాల సందడిలో

కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో    !! 2 !! పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవ దంపతులు ఒకటవ్వగా !! 2 !! స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడా స్వాగతం నీ పతిన్ చేరగా నవవధువ స్వాగతం నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడా స్వాగతం నరుడు ఒంటరిగ ఉండరాదని జంటగా ఉండ మేలని  ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని      !! 2 !! తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని                                            !! 2 !! స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడా స్వాగతం నీ సతిన్ చేరగా నవ వరుడా స్వాగతం నీ పతిన్ చేరగా నవ వధువ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడా స్వాగతం సాటిలేని సృష్టి కర్త సాటియైన సహాయము సర్వఙ్ఞానియైన దేవుడు  సమయోచితమైన ఙ్ఞానముతో  !! 2 !! సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది        !! 2 !! స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుడా స్వాగతం నీ పతిన్ చేరగా నవవధ...

కల్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం

కల్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం (2) దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా (2) ||కల్యాణం|| ఏదెను వనమున యెహోవ దేవా మొదటి వివాహము చేసితివే (2) ఈ శుభ దినమున నవ దంపతులను (2) నీ దీవెనలతో నింపుమయ్యా        ||దేవా రావయ్యా|| కానా విందులో ఆక్కరనెరిగి నీళ్ళను రసముగ మార్చితివే (2) కష్టములలో నీవే అండగా నుండి (2) కొరతలు తీర్చి నడుపుమయ్యా      ||దేవా రావయ్యా|| బుద్ధియు జ్ఞానము సంపదలన్నియు గుప్తమైయున్నవి నీయందే (2) ఇహ పర సుఖములు మెండుగ నొసగి (2) ఇల వర్ధిల్లగ చేయుమయ్యా      ||దేవా రావయ్యా||  

కలువరి గిరి యాత్రలో

కలువరి గిరి యాత్రలో మనుషులున్న ఎడారిలో " 2 " నా యేసుని వేదన ఈ జగతికి తల వంచెనా " 2 " నేరమేమి చేయలేదు దోషమేది కానరాదు ముళ్ళతో కిరిటమొత్తి తన్నుతూ గుద్దుతూ గేలి చేయుచు ఉమ్మిరా నోరు తెరువనే లేదు ప్రేమ  బలి పశువునిగా మారె ప్రేమ                              "  కలువరి " మూగ బోయెను వీధులన్నీ దాహమైన తీర్చలేదే చెళ్లుమని కొరడాలతోని కొట్టిరా తిట్టిరా బరబరా మని ఈడ్చిరా నెత్తుటి ముద్దాయే చూడు మహిమ రూపుని దేహము                              "  కలువరి " కాళ్లకు చేతులు సీలలు కొట్టి వ్రేలాడదీసేను ప్రక్కలో ఒక పోటు పొడిచి చచ్చేనా? బ్రతికేనా? వెతికి వెతికి చంపిరా ఏమని వివరించ గలను ఆ సిలువలో త్యాగము ఏమని వర్ణించ గలను నా యేసుని ప్రేమను                                "  కలువరి "

కలవంటిది నీ జీవితము

కలవంటిది నీ జీవితము కడు స్వల్ప కాలము యువకా అది ఎంతో స్వల్పము విలువైనది నీ జీవితం వ్యర్ధము చేయకుమా యువకా వ్యర్ధము చేయకుమా బహు విలువైనది నీ జీవితం వ్యర్ధము చేయకుమా యువతీ వ్యర్ధము చేయకుమా        కలవంటిది నీ జీవితము....... నిన్ను ఆకర్షించే ఈ లోకము కాటు వేసే విష సర్పము యువకా అది కాలు జారే స్థలము ఉన్నావు పాపపు పడగ నీడలో నీ అంతము ఘోర నరకము యువకా అదియే నిత్య మరణము నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం నూతన సృష్టిగా మార్చును పాపం క్షమియించి రక్షించును } 2 ఆ మోక్షమందు నీవుందువు యుగయుగములు జీవింతువు నీవు నిత్యము ఆనందింతువు } 2       కలవంటిది నీ జీవితము.......

కలలా ఉన్నది నేనేనా అన్నది

కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమౌతున్నది నీవు నాతో అన్నది నిరాశల నిధిలోన – ఉషోదయం వచ్చింది యేసు నీ ప్రేమే నను బ్రతికించెను (2)                                              ||కలలా|| మనుష్యులంతా మనసే గాయపరిచి పురుగల్లె నను నలిపేయ జూచినా (2) శూరుడల్లె వచ్చినావు నాకు ముందు నిలచినావు నాకు బలము ఇచ్చినావు ఆయుధంగా మార్చినావు చల్లని నీ నీడలో నిత్యము నిలువనీ                                              ||కలలా|| శూన్యములో నాకై సృష్టిని చేసి జీవితాన్ని అందముగా మలచేసి (2) మాట నాకు ఇచ్చినవారు దాన్ని నెరవేర్చువారు నిన్ను పోలి ఎవరున్నారు నన్ను ప్రేమించువారు యేసు నీ ప్రేమను ప్రతి దినం పాడనీ                                                  ||కలలా||

కలయే నిజమాయే నీ సన్నిధిలో నిలువగా

కలయే నిజమాయే  నీ సన్నిధిలో నిలువగా "2" కన్నీరంతయు నాట్యముగామారి.." 2" దేవా నీ సన్నిధిలో నేను ప్రార్థించగా.."2" 1. నీ దయ నొందిన నా వారి విడుదల కనులారా నే చూడగా "2" హర్షించేనయ్యా నా అంతరంగము "2" ఆనందింతును అభిషేక్తుడా నీలో "2"  "కలయే" 2. కడు దరిద్రుడనై కడలి అంచున ఎగిసే అల వలె నే మారగా.."2" శ్రీమంతుడవై నను చేరదీసి సిరిసంపదలతో నన్ను నింపినందునా "2"  "కలయే" 3. నింగి అంచున జారేటి చినుకులు నా బ్రతుకును తడుపగా.. "2" మహిమైశ్వర్యము నా సొంత మాయెను మరువలేను నీ మంచితనము.. "2"  "కలయే"

కరములు చాపి స్వరములు ఎత్తి

కరములు చాపి – స్వరములు ఎత్తి  హృదయము తెరచి – సర్వం మరచి    మనోహరుడా నీకే ప్రణమిల్లెదన్ – మహాఘనుడా నిన్నే ప్రస్తుతించెదన్  శిరమును వంచి ధ్వజములు ఎత్తి – కలతను విడచి కృపలను తలచి  మనోహరుడా నీకే ప్రణమిల్లెదన్- మహాఘనుడా నిన్నే ప్రస్తుతించెదన్  1.పాపాన్ని తొలగించె నీ దివ్య కృపను –    మరువగలనా మహానీయుడా    కల్వరిగిరిపై కురిసిన ఆ ప్రేమను -విడువగలనా నా యేసయ్యా      ..2..  నా ప్రాణానికే ప్రాణం నీవయ్యా – నా ధ్యానానికే మూలం నీవయ్యా  ..2..                                                                              || కరములు || 2.    చీకట్లు తొలగించే నీ దివ్య వెలుగును- మరువగలనా మహానీయుడా  సంద్రాన్ని అణచిన నీ గొప్ప శక్తిని- విడువగలనా నా యేసయ్యా     ..2..  నా జీవానికే జీవం నీవయ్యా – – నా గానానికి రాగం ...

కమ్మని బహుకమ్మని

కమ్మని బహుకమ్మని – చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని – యేసు నీ ప్రేమామృతం (2) జుంటె తేనె కన్న మధురం – సర్వ జనులకు సుకృతం (2) యేసు నీ ప్రేమామృతం (2)        ||కమ్మని|| ఆశ చూపెను ఈ లోకం – మలినమాయెను నా జీవితం యేసూ నీదు ప్రేమ – దయ చూపెను ఈ దీనురాలి పైన (2) వెలిగెను నాలో నీ ఆత్మ దీపము (2) కడిగిన ముత్యముగా అయ్యాను నేను (2)        ||కమ్మని|| నా కురులతో పరిమళమ్ములతో – చేసెద నీదు పాద సేవ నా గుండె గుడిలో కొలువైయున్న – నీకు చేసెద నేను మధుర సేవ (2) ఆరాధింతును నిన్ను అనుదినము (2) జీవింతును నీకై అనుక్షణము (2)        ||కమ్మని

కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య

కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య తీయనీ నీ పలుకలలోన నే కరిగిపోనా నా యేసయ్య కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య తియ తీయనీ నీ పలుకలలోన నే కరిగిపోనా నా యేసయ్య నా హృదిలో కొలువైన నిన్నే సేవించనా నా యేసయ్య నా హృదిలో కొలువైన నిన్నే సేవించెదా నా యేసయ్య   1. విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం జుంటె తేనె ధారల కన్నా మధురమైనది నీ నామం విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం జుంటె తేనె ధారల కన్నా మధురమైనది నీ నామం సమర్పణతో నీ సన్నిధిని చేరి నిత్యము నిన్నే ఆరాధించనా సమర్పణతో నీ సన్నిధిని చేరి నిత్యము నిన్నే ఆరాధించనా || కమనీయమైన ||  2. వేసారిపోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడనా వేసారిపోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడనా కన్నీటితో నీ పాదములు కడిగి మనసారా నిన్నే పూజించనా కన్నీటితో నీ పాదములు కడిగి మనసారా నిన్నే పూజించనా నీ కృపలో గతమును వీడి మరలా నీలో చిగురించనా నీ కృపలో గతమును వీడి మరలా నీలో చిగురించనా ||కమనీయమైన ||

కన్ను తెరిస్తే వెలుగురా

కన్ను తెరిస్తే వెలుగురా కన్ను మూస్తే చికటిరా నొరు తేరిస్తే శబ్ధమురా నొరు మూస్తే నిష్షబ్ధమురా ఏ క్షేణమో తేలియదు జీవిత ఆంతం ఈ క్షణమే చేర్చుకో యేసునీ సొతం ఊయల ఉగితె జోల పాటరా ఊయాల ఆగితే ఎడుపు పాటరా ఊపిరి ఆడితే ఉగిసలాటరా ఊపిరి అగితే సమాది తోటరా బంగారు ఉయాల ఊగినా నీవు  భుజములపై నిన్ను మొయాక తప్పదురా పట్టు పరుపు పైన పొర్లిన నీవు మట్టి పరుపులోన నిన్ను పెట్టక తప్పదురా

కన్నీళ్ళు విడిచి నీ పాదాలనే కడుగన

కన్నీళ్ళు విడిచి నీ పాదాలనే కడుగన నా ప్రాణ ప్రియుడా  నిన్నే ఆరాధన చేయానా నా సర్వమా నా యేసయ్యా " 2 " ఆరాధన చేయానా నీకే   " 2 " ఆరాధన ఆరాధన    " 2 " ప్రతి ఉదయం నీ పాదములే దర్శీంచనా యేసయ్య నా హృదయం నా ఆత్మను క్రుమ్మరించనా దేవా వెలిగెత్తి ప్రార్ధన చేసి నీ కృపను పొందేద దేవా నా కళ్ళలో ఇక నీ రూపమే నిండని నా తలవంచి నీ సన్నిదిలో  గొజాడి ప్రార్ధించనా బహు వినయముతో నీ చెంత బ్రతుకంత నేనుండనా నీ నామ స్మరణలోనే ప్రతి ఫలము పొందేదనయ్య బ్రతుకంతయు అర్పించి ప్రార్ధించెదా నా సర్వం అర్పించి నీతోనే నే సాగేదా ప్రియమైన నీ సన్నీదిలో  ఆరాధన చేయనా ఘణమైన నీదు ప్రేమ నే చాటేద లోకములోన నీ సాక్షిగా జీవించేద యేసయా

కన్నీరే మనిషిని బాధిస్తుంది

కన్నీరే మనిషిని బాధిస్తుంది ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది (2) కన్నీరే కాదనుకుంటే ఓదార్పే కరువైపోతుంది (2)        ||కన్నీరే|| కన్నీరే మరియను బాధించింది ఆ కన్నీరే మరణము గెలిపించింది (2) కన్నీరే కాదనుకుంటే లాజరు తిరిగి బ్రతికేనా (2) కన్నీరే వలదనుకుంటే దేవుని మహిమ కనిపించేనా (2)  ||కన్నీరే|| కన్నీరే హన్నాను బాధించింది ఆ కన్నీరే కుమారుని దయచేసింది (2) కన్నీరే కాదనుకుంటే సమూయేలు జన్మించేనా (2) కన్నీరే వలదనుకుంటే దేవుని కృపను గాంచేనా (2)        ||కన్నీరే||

కన్నీరెలమ్మ కరుణించు యేసు

కన్నీరెలమ్మ కరుణించు యేసు నిన్ను విడువాబోడమ్మ కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువాబోడమ్మా కరుణచూపి కలతమాన్పే  "2" యేసే తొడమ్మా నీకేమిలేదని ఏమితేలేదని అన్నారనిన్ను అవమాన పరిచార తలరాత ఇంతేనని తరవాత ఏమౌనోనని రెపటిని గూర్చి చింతించుచున్నవా చింతించకన్న యేసు మాటను మరిచావా మారాను మధురంగా మార్చెను చూసావా  నీకేవరు లేరని ఎంచెయ్యలేవని అన్నారా నిన్ను నిరాశ పరిచారా పురుగంటి వాడనని ఎప్పటికి ఇంతేనని నాబ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా నేనున్నా నన్న యేసు మాటను మరిచావా కన్నీరు నాట్యంగా మార్చెను చూస్తావా

కన్నీరంతా తుడిచివేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి

కన్నీరంతా తుడిచివేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి           "2" ఓదార్చిన నా యేసయ్యా నీ మేలు మరువలేనయ్యా      "2"                                       "కన్నీరంతా" ఎవరు లేని ఒంటరివేళ ఉన్నావయ్యా...నాతోడుగా       "2" విడువలేదే...ఏక్షణమైనా          "2" ప్రేమించిన నా యేసయ్యా  నిను విడిచి ఉండలేనయ్యా       "2"                                       "కన్నీరంతా" గుండెపగిలి ఏడ్చిన వేళా ఓదార్చినా నా యేసయ్యా         "2" భుజము తట్టి నెమ్మదినిచ్చి       "2" బలపరిచిన నా యేసయ్యా యెహోవా షమ్మా నీవయ్యా        "2"                                       "కన్న...

కన్నతల్లి కన్న మిన్నగా ప్రేమచూపు ధైవమా

కన్నతల్లి కన్న మిన్నగా ప్రేమచూపు ధైవమా అన్నివేళలందు తండ్రీగా ఆదరించు ధైవమా నీ ప్రేమతో పిలువగా ఏంతో మధురము  నీ కృపనాపై చూపగా బ్రతుకు ధన్యము తల్లిగర్భలో రూపింపబడకమునుపు నీ అరచేతిలో చెక్కియుంటివి కన్న బిడ్డను తన తల్లి మరచునేమో మరువక ప్రేమించిన  మామంచి దేవుడవు నాలోని ఆశలు రూపమా నను నడిపె నా జీవన గమనమా శరీరా ఆశలతో దుర్నితీ సాదానముగా పాప నియామమునకు బానిసైతిని పరిశుద్ధజనముగా నీ సొతైన ప్రజలుగా నీతి సాదనముగా నను మార్చిన దేవుడవు నాలోని ఆశలు రూపమా నను నడిపె నా జీవన గమనమా

కనులున్నా కానలేనిచెవులున్నా వినలేని

కనులున్నా కానలేని చెవులున్నా వినలేని-(2) మనసున్నా మతి లేని స్థితియున్నా గతిలేని-(2) వాడను యేసయ్య... ఓడిపోయిన వాడను.-(2)          ||కనులున్నా కానలేని|| అన్నీ ఉన్నా ఏమి లేని అందరూ ఉన్న ఏకాకిని దారి ఉన్నా కానరాని చెంతనున్న చేరలేని యేసయ్య... నన్ను విడువకయ్యా-(2) దిక్కులేని వాడని వాడను యేసయ్యా... చెదరిపోయిన గూడును             కనులున్నా కానలేని భాషలున్నా భావము లేని ఆత్మ ఉన్నా అవివేకిని భక్తి ఉన్నా శక్తి లేని ప్రార్థన ఉన్న ప్రేమ లేని యేసయ్య... నన్ను కరునించుమా-(2) ఫలము లేని వాడను వాసిని యేసయ్య... పేరుకు మాత్రమే విశ్వాసిని కనులున్నా కానలేని బోధ ఉన్నా బ్రతుకు లేని పిలుపున్నా  ప్రయాస పడని సేవ ఉన్నా సాక్ష్యము లేని  సంఘమున్నా ఆత్మలు లేని యేసయ్య...నన్ను నింపుమయ్య-(2) ఆత్మ లేని వాడను పాదిరిని యేసయ్య మాదిరి లేని కాపరిని                కనులున్నా కానలేని

కనులు నిన్నే చూడలని-మనస్సు నిన్నే చేరాలని

కనులు నిన్నే చూడలని- మనస్సు నిన్నే చేరాలని నా తోడుగా నివు ఉండలనీ ఆశగా ఉన్నది ఆశగా ఉన్నది ఆశగా ఉన్నది యేసయ్యా ఆశగా ఉన్నది                                                   "కనులు" నీతిగా నిలిచావు-నిందలే మెసావు రక్షగా ఉన్నావు-రక్తమే కార్చావు నే మరువలేను నీ త్యాగము- నే విడువలేను నీ మార్గం నీ కృప......దీవనే పోందాలని                                                     "ఆశగా" జీవమై ఉన్నావు-జీవితం ఇచ్చావు ప్రేమనే పేంచావు-ప్రాణమే వీడిచావు ఏమిఇవ్వగలను నీ ప్రేమకు- ఆపురుపమైన నీకరుణకు హృదయమే ప్రేమతో ఇవ్వాలని                                                    "ఆశగా"

కనురెప్ప పాటైన కను మూయలేదు

కనురెప్ప పాటైన కను మూయలేదు   ప్రేమ ప్రేమ ప్రేమ నిరుపేద స్థితిలోను నను దాటిపోలేదు   ప్రేమ ప్రేమ ప్రేమ (2) పగలూ రేయి పలకరిస్తుంది పరమును విడిచి నను వరియించింది (2) కలవరిస్తుంది ప్రేమా ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ        ||కనురెప్ప|| ప్రేమ చేతిలో నను చెక్కుకున్నది తన రూపులో నన్ను మార్చుకున్నది (2) ప్రేమకు మించిన దైవము లేదని ప్రేమను కలిగి జీవించమని (2) ఎదురు చూస్తుంది ప్రేమా ప్రాణమిచ్చిన క్రీస్తు ప్రేమ        ||కనురెప్ప|| ప్రేమ కౌగిలికి నన్ను పిలుచుచున్నది ప్రేమ లోగిలో బంధించుచున్నది (2) ప్రేమకు ప్రేమే తోడవుతుందని ప్రేమకు సాటి లేనే లేదని (2) కలవరిస్తుంది ప్రేమా ప్రాణమిచ్చిన క్రీస్తు ప్రేమ         ||కనురెప్ప||

కనుగొంటిని నిన్నే ఓ నజరేయ

కనుగొంటిని నిన్నే ఓ నజరేయ సమర్థుడవని సహాయము చేయా (2) నీ ప్రభావము నాలోకి చెరగా  (2) నా స్వరూపము మారిపొయేగా  (2) ప్రయత్నలు చేసి వెసారియుంటిని ఉన్న ఆస్థి అంత చేజార్చుకుంటిని    (2) వైద్యుల చుట్టు కాళ్ళు అరిగెటట్టు    (2) ఎంత తిరిగిన సరికాకయుంటిని      (2) స్వంత జనులతోనే వెలివేయబడితిని అపనిందలపలై మతి పొయి చెడితిని    (2) బ్రతుకెందుకని మనసే చంపుకొంటిని      (2) జీవచ్శవమై ఇలా మిగిలియుంటిని        (2) నీ మహిమను గూర్చు వార్తలను వింటిని స్వస్థపరచు దేవా నినునమ్ముకుంటిని   (2) దైర్యం లేక ఎదురుగ రాలేక           (2) వెనుక నుండి వచ్చి నినుముట్టుకుంటిని(2)

కదిలిందీ కరుణరధం

కదిలిందీ.. .కరుణరధం .. సాగిందీ.. క్షమాయుగం మనిషి కొరకు దైవమే కరిగీ వెలిగే కాంతిపధం కదిలింది.. కరుణరధం .. సాగింది.. క్షమాయుగం మనిషి కొరకు దైవమే మనిషి కొరకు దైవమే కరిగి వెలిగె కాంతిపధం మనుషులు చేసిన పాపం.. మమతల భుజాన ఒరిగిందీ.. పరిశుద్ధాత్మతో పండిన గర్భం..వరపుత్రునికై వగచింది.. వగచిందీ..... దీనజనాళికై దైవకుమారుడు..  పంచిన రొట్టెలే..  రాళ్ళైనాయి..... పాప క్షమాపణ  పొందిన హృదయాలు నిలివున కరిగీ..  నీరయ్యాయి..  నీరయ్యాయి  *అమ్మలారా! నా కోసం.. ఏడ్వకండి మీ కోసం మీ పిల్లల కోసం ఏడ్వండి* ద్వేషం.. అసూయ..కార్పణ్యం..  ముళ్ళ కిరీటమయ్యింది  ప్రేమా..సేవా..త్యాగం.. చెలిమి నెత్తురై ఒలికింది.. ఒలికిందీ..... తాకినంతనే స్వస్తత నొసగిన తనువుపై కొరడా ఛెళ్ళందీ....... అమానుషాన్ని అడ్డుకోలేని  అబలల ప్రాణం అల్లాడింది అల్లాడి ఉందీ....... ప్రేమ పచ్చికల పెంచిన కాపరి  దారుణం హింసకు గురికాగా చెదిరిపోయిన మూగ గొర్రెలు  చెల్లాచెదరై కుమిలాయి పరమ వైద్యునిగ  పారాడిన పవిత్ర పాదాలూ నెత్తురు ముద్దగ మారాయి అభిషిక్తుని రక్తాభిషేకంతో  ధరణి ద్రవించి ముద్దాడింది శిలువను ...

కట్టెలపై నీ శరీరం కనిపించదుగంటకు మళ్ళీ

కట్టెలపై నీ శరీరం కనిపించదుగంటకు మళ్ళీ మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి ఎన్ని చేసినా తను నమ్మిన  కట్టే మిగిల్చింది కన్నీటి గాధ -(2)   ||కట్టెలపై||  దేవాది దేవుడే తన పోలిక నీకీ చ్చెను  తన ఆశ నీలో చూసి పరితపించి పోవాలని(2)  కన్న తండ్రినేి మరిచి కాటి కెళ్ళి పోతావా నిత్యజీవం విడిచి  నరకం వెళ్ళిపోతావా(2)            || ఎన్ని చేసిన ||  ఆత్మని లో ఉంటేనే అందరు నన్ను ప్రేమిస్తారు అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరము ఉండదు(2)  కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారు ఉన్నను ఎవ్వరికి కనిపించక  నీ ఆత్మ వెళ్లి పోవును(2)           ||ఎన్ని చేసిన||

ఓ సొదరా ఓ సొదరి యేసే నిన్ను నన్ను పిలుచుచున్నాడు

ఓ సొదరా ఓ సొదరి  యేసే నిన్ను నన్ను పిలుచుచున్నాడు  నిదురమాను మగత వీడు  కన్ను విప్పి కలియజూడు యెరుషలేము గుమ్మములు కాలిపోతున్నవి ప్రాకారపు గోడలు కూలిపోతున్నవి ప్రార్ధనాయుధముతో పునరుత్థాన శక్తితో పునఃనిర్మాణము చేతము రండి నిరాశ నిష్పహలే ఎదురు నిలిచినా నిందలెన్నో మబ్బులుగ మనల క్రమ్మినా నిలిచెదం యేసుతో నడిచెదం దీక్షతో నీరీక్షణ బలముతో సాగిపోదము అపవాది బాణములు ఎన్ని విసిరిన  అగ్ని గంధకముల వాన చుట్టు ముసిరిన అదరము బెదరము  అరికి మనము వెరవము  అన్న యేసు సన్నిధిలో లేదిక భయము సంఘమనగా క్రీస్తు యేసు దేహమే కదా చావు నోడించినది ఈ దేహమే కదా సిలువ తేజస్సుతో కరుణమూర్తి మనసుతో సిరులు విరియు జీవితాలు నిర్మిద్దాము యేసే ఈ సంఘమునకు అసలు పునాది యేసే ఈ జగత్తుకు ఆశజ్వోతి  యేసే ఆరంభము ఆయనే అంతము యేసే మన జీవితాల నవవసంతము సాక్ష్యమిచ్చె సంఘమే జీవించే సంఘము జీవించే సంఘమే సాక్ష్యమిచ్చు సంఘము సాక్ష్యము విశ్వాసము సౌఖ్యము సహవాసము సిలువ చలువ పందిరిలో వర్ధిల్లాలి

ఓ మేఘమా నాలోన కురుయుమా

ఓ మేఘమా నాలోన కురుయుమా ఎండిన నేలనై నీ వైపే చూస్తున్న ఆత్మ వర్షమా నను తడుపుమా  ఆశతో నీ సన్నిధి వచ్చాను యేసయ్య  బీడైన భూమిలా పాడైపోతిని ఆత్మ ఫలములేక నిరాశలో ఉన్నాను (2) తొలకరి వర్షము కురిపించి దీవించుమయ్య నను ఇలలో ఏదెను వనముల బ్రతుకంతా మారాలి   అంత్యా దినములలో నీ జనులందరి పైన ఆత్మ వర్షమును కురిపిస్తానన్నావు (2) కడవరి వర్షము కురిపించి ఉజీవమును రగిలించి ఉజయన వనముల సంఘము చేయుము   అద్భుత కార్యములు జరిగించుటకు కొరకై ఆలకిరించుమయ్య ఆత్మ వారములతో(2) ఆత్మభిషేకముతో నింపి పంపించుమయ్య  లోకములో ఫలియించె పొలములై జీవిచేద మీ కొరకై 

ఓ మానవ నీ పాపం మానవా

ఓ మానవ నీ పాపం మానవా  యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా  పాపములోనె బ్రతుకుచున్నచో  చెడును నీ దేహము పాపములోనె మరణించినచో  తప్పదు నరకము (2) ఏంతకాలము పాపములోనే బ్రతుకుచుందువూ… ఏంతకాలము శాపములోనే కొట్టబడుదువూ… ఏంతకాలము వ్యసనపరుడవై తిరుగుచుందువూ… ఏంతకాలము ధుఃఖములో మునిగియుందువూ… యేసుని నమ్మి పాపమునుండి  విదుదల పొందుమూ యేసయ్యా తన రక్తంతో  నీ పాపం కడుగును ఏంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువూ… ఏంతకాలము దేవుదు లేక బ్రతుకుచుందువూ… ఏంతకాలము దేవుని మాటను ఎదిరించెదవు ఏంతకాలము దేవుని నీవు ధుఃఖపరతువూ యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెనూ యేసయ్యే నిను రక్షించి పరమున చేర్చును

ఓ మనసా నా మనసా ఓ మనసా నా మనసా

ఓ మనసా నా మనసా ఓ మనసా నా మనసా శోదనలో పడి వేదనతో ఉన్నావా ఎరిగి ఎరిగి శోదనలో పడి కృంగి యుంటివా విరిగెవిరిగె హృదయ పలకం  ముక్కలు ముక్కలుగా  కరిగి పొయావా కడలితరగంలా జరిగిపొయావా క్రీస్తూకు దూరంగా శోదకుడైన సాతాను నీకు గాలం వేశాడు ఎర చూపించి భ్రమ చూపించి నినుచిక్కించాడు చివరకు నిన్ను బానిసా చేసి విజయగర్వంముతో తానునవ్వుతున్నాడు శాంతి శత్రువై భ్రంతికి చెరువై నీవువుందువా శాంతి సమాదానం మనసుకు ఉల్లసం  ఒసగె దేవుడు ఆయనే ఆయన ఘన నామం ఆరాదించుమా ఆయన మేళ్ళను మరువకు మనసా

ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి

ఓ ప్రభువా - ఓ ప్రభువా            నీవే నా మంచి కాపరివి            నీవే నా మంచి కాపరివి  చll  దారితప్పిన నన్నును నీవు         వెదికి వచ్చి రక్షించితివి         నిత్య జీవమునిచ్చిన దేవా         నీవే నా మంచి కాపరివి.   ll ఓ ప్రభువా ll  చll  నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని         ఎల్లప్పుడూ చేయి విడువక        అంతమువరకు కాపాడు దేవా         నీవే నా మంచి కాపరివి     ll ఓ ప్రభువా ll  చll  ప్రధాన కాపరిగా నీవు నాకై         ప్రత్యక్షమగు ఆ గడియలో         నీవు నన్ను మరువని దేవా        నీవే నా మంచి కాపరివి   ll ఓ ప్రభువా ll

ఓ గొప్ప కాపరి నా మంచి సమరయుడా

ఓ గొప్ప కాపరి నా మంచి సమరయుడా నీవే నా కాపరి నీవే నా ఊపిరి కళ్ళలో కదలాడే కన్నీళ్ళన్నిటిని తుడచిన స్నేహితుడా నా మంచి స్నేహితుడా హృదయంలో రేగె గాయాలన్నిటిని కట్టినా సమరయుడా నా మంచి సమరయుడా అలసిన మనసులో చెలిమితో చెరి ఓదార్చె నేస్తామా నా మంచి నేస్తామా

ఒంటరీగానేనున్న ఎవరు లేకపోయినా

ఒంటరీగానేనున్న ఎవరు లేకపోయినా ఆశలన్నీ కోల్పోయిన అనాధగానే మిగిలిన "2"  నీవే నా సర్వం నీవే నా ఆధారం "2"           "ఒంటరిగానే"..       ఎవరులేని జీవితంలో నతోడుగా ఉన్నావు  ఎవరు రాని ఈపయణంలో నా తోడుగా నడిచావు "2" నీవే నా జీవం నీవే నా గమ్యం "2"           "ఒంటరిగానే" శ్రమలేన్నో తరుముచున్నాను  న సహాయమైనవు రోగము నను వేదించినను  నాకు స్వస్థతనిచ్చావు "2"  నీవే నా ధైర్యం నీవే నా ప్రాణం "2"           "ఒంటరిగానే" స్నేహితులే అవమానించిన నీప్రేమను చూపావు బంధువులే ద్రోహం చేసిన నిదివేనాలిచ్చావు "2" నీవే నా స్నేహం నీవే నా సైన్యం "2"            "ఒంటరిగానే"..

ఒంటరినై నేనుండగా వేయిమందిగా నను మార్చినావు

ఒంటరినై నేనుండగా -  వేయిమందిగా నను మార్చినావు ||2|| ఎన్నికలేని నన్ను బలమైన పనిముట్టుగా                                                  ||2|| నను వాడుకో నా యేసయ్యా -  నీ సేవలో నను వాడుకో  నను వాడుకో నా యేసయ్యా -  నీ పరిచర్యలో నను వాడుకో ||2||  షిత్తిములో ప్రజలు వ్యభిచారము చేయగా - నీ కోపము రగులుకొని  తెగులును పంపితివి ||2||  నీవు ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవుచు ||2||  నీపై ఆశక్తి చూపిన ఫినెహాసులా ||2||                                      ||నను వాడుకో||  ఆనాటి ప్రజలందరితో  తన సాక్ష్యము చెప్పుచు -  ఎవనియొద్ద సొమ్మును  నేను ఆశింపలేదని ||2||  ప్రార్ధన మానుటవలన  పాపమని ఎంచుచు ||2||  శ్రేష్టమైన సేవ చేసిన సమూయేలులా||2||                        ...

ఒక్కసారి నన్ను క్షమియించవా దిక్కులేని స్థితిలో నే పడియుంటిని

ఒక్కసారి నన్ను క్షమియించవా దిక్కులేని స్థితిలో నే పడియుంటిని"2" అయ్యో నాపాపం అడ్డువచ్చెనే " 2 " సమాధానమే లేక కృంగిపోతిని " 2 " యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా " 2 "                      చెడు స్నేహమే నన్ను చెరిపినది సుడిగుండమై నన్ను చుట్టినది  " 2 " చివరి ఘడియలో నేను నిన్ను పిలువగా "2" అలలాగా వచ్చి నీ దరికి చేర్చవా " 2 ' యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా " 2 "                     అన్యులే నన్ను వెలివేయగా బంధుమిత్రులే నన్ను బాధించగా "2" సమాధిలోనికే నేను దిగిపోతినే " 2 " సమాధానమే లేక చచ్చియుంటిని "2" యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా " 2 "                      ఆకలితో నేను అలమటించగా దాహముతో నేను తపియించగా "2" జీవాహరముతో నను నింపవా " 2 " నీ జీవజలములతో తృప్తిపరచవా"2" యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా " 2 "                    

ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవా నా మనసు నిండింది

ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవా నా మనసు నిండింది ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది (2) నా ప్రతి శ్వాసలో నువ్వే ప్రతి ధ్యాసలో నువ్వే ప్రతి మాటలో నువ్వే నా ప్రతి బాటలో నువ్వే (2)         ||ఒకసారి|| నీ సిలువ నుండి కురిసింది ప్రేమ ఏ ప్రేమ అయినా సరితూగునా (2) నీ దివ్య రూపం మెరిసింది ఇలలో తొలగించె నాలోని ఆవేదన        ||నా ప్రతి|| ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా బ్రతికించు మమ్ములను నీ కోసమే (2) తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం నడిపించు మమ్ములను నీ బాటలో        ||నా ప్రతి|

ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పోంగెను

ఒక దివ్యమైన సంగతితో  నా హృదయము ఉప్పోంగెను యేసురాజని నాప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తని పదివెయిల మందిలో నా ప్రియుడు యేసు దవళవర్ణుడు అతికాక్షనీయుడు తనప్రేమ వేయి నదుల విస్తారము వేవెల నొళ్ళతో కీర్తింతును పన్నెండు గుమ్మముల పట్టణములో నేను నివాసము చేయాలని తన సన్నీధిలో నేను నిలవాలని ప్రభుయేసులో పరవవాసించాలని

ఒక క్షణమైనా నిన్ను వీడిఉండలేనయ్య నా యేసయ్యా

ఒక క్షణమైనా నిన్ను వీడి ఉండలేనయ్య నా యేసయ్యా (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఒక క్షణమైనా|| నశియించిపోతున్న నన్ను బ్రతికించినావయ్యా యేసు కృశించిపోతున్న నాలో వేంచేసినావయ్యా యేసు (2) నీ కార్యములెంతో ఆశ్చర్యకరములయ్యా నీ వాగ్దానములెంతో నమ్మదగినవయ్యా ||యేసయ్యా|| మతిలేక తిరిగిన నన్ను నీ దరి చేర్చినావయ్యా యేసు శ్రమ చేత నలిగిన నాకు వరమిచ్చినావయ్యా యేసు (2) నీ ఆలోచనలెంతో లోతైన దీవెనయ్యా నీ తలపులు ఎంతో మధురము నా యేసయ్యా ||యేసయ్యా||

ఐక్య పరచుమయ్యా ఈ వధూవరులను

ఐక్య పరచుమయ్యా ఈ వధూవరులను సౌఖ్యమిచ్చి కాయుము నవ దంపతులను మధుర ప్రేమలో మనసులు కలువ హృదయ సీమలే ఒకటిగ నిలువ  నీ దీవెనలే పంపుమా ఆనందము తోడ దుఃఖమునే గెల్వ చిరునవ్వు తోడ కష్టముల నోర్వ సంసారనావను సరిగా నడిపించ నీవే సహాయమీయుమా ప్రార్ధన జీవితము సమాదానము భక్తి విశ్వాసము నీతి న్యాయము నీవు చూపిన కనికరం నీవు నేర్పిన సాత్వికం అనుగ్రహించి నడిపించుమా ఇహలోక బోగముపై మనసుంచక  పరలోక భాగ్యముపై లక్ష్యముంచగ నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై  సాగే కృప దయచేయుమా

యేసయ్యా నాకంటూ ఎవరులేరయ్యానిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని

యేసయ్యా నాకంటూ ఎవరులేరయ్యా నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని నిన్ను వెదకుచూ పరిగెత్తుచుంటిని చూడు ఏసయ్యా నన్నుచూడు ఏసయ్యా చేయిపట్టి నన్ను నీవు నడుపు ఏసయ్యా కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతినీ బయట చెప్పుకోలేకఋమన్సు నేర్చితీ లేరు ఏవరు వినుటకు  రారు ఏవరు కనుటకు లోకమంతా వెళివేయగా కుమిళిపోతిని నమ్మిన వారు నను వీడగా బారమాయేను లేరు ఎవరు వినుటకు రారు  ఎవరు కనుటకు

ఏముంది నాలో - నీ పరిశుద్ధత లేదేఅయినా నను ప్రేమించితివే

ఏముంది నాలో - నీ పరిశుద్ధత లేదే అయినా నను ప్రేమించితివే ఎందుకో ఈ ఘోరపాపిని చేర దీశావు ప్రభువా ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే  అయినా నను ప్రేమించితివే  అయినను నన్ను ప్రేమించావు కరుణించావు నన్ను మురిపించావు అన్యాయపు తీర్పు పొందావు నాకై అపహాస్యం భరియించావు ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువ లేదే  నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ త్యాగమే నన్ను బ్రతికించింది ||ఏముంది|| ఉమ్మిరి నీదు మోముపైన నా కోసం భరియించావు  గుచ్చిరి శిరమునే ముండ్ల మకుాన్ని నా కోసం ధరియించావు  నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం  నీ త్యాగమే నన్ను బ్రతికించింది ||ఏముంది|

ఏమివ్వగలమయ్యా నీ ప్రేమకు మేమేమివ్వగలమయ్యా

ఏమివ్వగలమయ్యా నీ ప్రేమకు మేమేమివ్వగలమయ్యా నీ వాత్సల్యతకు మాకున్నదంతా నీ పాదచెంత -  అర్పించి సేవించినా నీ ఋణం తీరునా|| 2||   ||ఏమివ్వగలమయ్యా|| 1.మీమింకను బలహీనులమైయుండగా మా కొరకై నీవు భువికొచ్చినావు  మా అత్రికమములకై గాయపరచబడుటకై నిన్ను నీవే అప్పగించుకొంటివా  మితిలేని ప్రేమ యోగ్యతలేని మాపై చూపించినావా - నీకేమివ్వగలము ||2||   ||మాకున్నదంతా|| 2.మేమింకను పాపులమైయుండగా పరిశుద్ధలను చేయ ఏతెంచినావు  మా పాపములకై బాధింపబడుటకై  నిన్ను నీవే అర్పించుకొంటివా  శాశ్వత ప్రేమ అర్హతలేని మాపై చూపించినావు -నీకేమివ్వగలము||2|| ||మాకున్నదంతా|| 3.మేమింకను విరోధులమైయుండగా సమాధానపరచుటకు దిగివచ్చినావు మా దోషములకై నలుగగొట్టబడుటకై నిన్ను నీవే సమర్పించుకొంటివా విస్తారమైన ప్రేమ ఎన్నికలేని మాపై చూపించినావు - నీకేమివ్వగలము ||2||  ||మాకున్నదంతా||

ఏమివ్వగలను యేసయ్యా ఏమిలేదె ప్రభు నాదంటు

ఏమివ్వగలను యేసయ్యా  ఏమిలేదె ప్రభు నాదంటు నాదన్నదంతయు నీదే  నే జీవించడం నీ కృపయే తల్లి గర్బములో నే ఉన్నప్పుడు  రూపము నిచ్చిన తల్లివి నీవే ముక్కు రంద్రములో ప్రాణ వాయువు నూది జీవము నిచ్చిన తండ్రివి నీవే ఈ లోకం దాని వ్యామోహము  నా ముందే గతియించి పోవును కాని నీవిచ్చిన ఆత్మవరం  నాలో జీవమై వికసించును

ఏమివ్వగలను నీ దివ్యప్రేమకు

ఏమివ్వగలను నీ దివ్యప్రేమకు ఏమివ్వగలనయ్యా నీ శిలువ ప్రేమకు  నా ప్రాణమునే నీకిచ్చినా నీ ఋణం తీరేనా                                   " ఏమివ్వగలను "                    నా పాపము కొరకు శిలువలో వేలాడి నా దోషము కొరకు రక్తమును కార్చితివి "2" నా హృదయమునే నీకిచ్చినా నీ ఋణం తీరేనా............... "2"                     " ఏమివ్వగలను "                     నా చెడుతనమును తుడిచేసితివి నా దీన స్థితిని సరిచేసితివి.... "2" నా జీవితం నీకిచ్చినా నీ ఋణం తీరేనా "2"                     " ఏమివ్వగలను "                     నా తల్లివలే నన్ను ప్రేమించితివి నా తండ్రివలే నన్ను కాపాడితివి "2" నా సర్వమునే నీకిచ్చినానీ ఋణం తీరేనా               ...

ఏమివ్వగలనయ్య నా యేసయ్యానీవు చేసిన మేలులకై

ఏమివ్వగలనయ్య నా యేసయ్యా నీవు చేసిన మేలులకై (2) నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా (2)         ||ఏమివ్వగలనయ్య|| 1. గురి లేని నా జీవిత పయనంలో దరి చేరి నిలచిన నా దేవుడవు మతి లేక తిరుగుతున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు ఎందుకింత నాపైన ఈ ప్రేమ వర్ణింపలేను నా యేసయ్యా (2)         ||నిన్ను గూర్చి|| 2. ఈ లోకంలో నాకు ఎన్ని ఉన్ననూ నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా నీ సాక్షిగా ఇలలో బ్రతికేదన్నయ్యా నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా ఏమిచ్చి నీ ఋణం తీర్చెదనయ్యా నీ పాత్రగా నన్ను మలచినందుకు (2)         ||నిన్ను గూర్చి||

ఏమి లేదు నాయందు అతిశయించుటకు

ఏమి లేదు నాయందు అతిశయించుటకు నా అతిశయం నీవే యేసయ్య యేసయ్యా   - యేసయ్యా - యేసయ్యా (2) 1. నీ ఆలోచనలు అతి గంభీరములు  అవి నా ఊహకు అందనివి  ఉన్నత స్థానములో నన్ను నిలుపుటకు  పెంటనుండి నన్ను  నివు లేపావు దేవా (2) 2 అడవి ఒలీవ కొమ్మ నేను యేనయ్యా సారమైన ఒలీవ చెట్టు నీవు యేసయ్యా నీలో నేను ఫలియించాలని  పనికిరాని కొమ్మలన్నీ విరిచావు దేవా   (2) 3. కన్న తల్లి ప్రేమ కన్నా మిన్న అయిన ప్రేమ  బంధువుల ప్రేమ కంటే బహు విలువైన ప్రేమ ఆత్మీయుల పేమ కంటే ఆదరించు ప్రేమ ఆ ప్రేమయే నన్ను జీవింపచేసెను                 (2)

ఏపాట పాడను ఏ మాట చెప్పను

ఏపాట పాడను  ఏ మాట చెప్పను ఏపదము చాలును ఏ భాష చాలును ఏ విధము చాటను నా హృదయ నాథుడా నీ ప్రేమ చాటను నా ప్రేమ పూర్ణుడా ప్రియుడా యేసయ్యా  ప్రేమ రూపివి నీవయ్యా"2" "                      " ఏ పాట" 1.నిన్నెంతగానో బాధించినా నినువీడిదూరంగానేపోయినా2 నేనంతగానో చేడిపోయిన నన్ను విడాలేదెవిలువైనప్రేమ వివరించ నాతరమావునా దేవా నాప్రియ దేవా నీదరిచేరి స్తుతులను తెలిపా నీకై నన్నిలనిలిపి లోకములో  నీ ప్రేమనుతెలుపా నాపై నీవే చూపిన  కృపాలన్ని తలచీ "ఏ పాట" 2.ఎత్తైన కొండకు ఎక్కించను వింత్తైనప్రేమనుచూపించను"2" నిండైన దీవెన నాకియ్యాను నాచెంత చేరినా నీప్రేమను వివరించ నాతరమావునా రాజా యేసు రాజా నిన్నెకొలువా మహిమనుతెలుపా నాపై నీ దయ చూపి లోకములో నీ ప్రేమను తెలుపా నాపైనీవేచూపిన కృపాలన్నితలచి     "ఏపాట"

ఏది ఎమైన గాని నీతోనే ఉంటానయ్యా

ఏది  ఎమైన గాని నీతోనే ఉంటానయ్యా నన్నుఎవరేమన్నా గాని నిను విడిచిపోలేనయ్యా నా ప్రాణమా నా సర్వమా నాకున్నది నీవేనయ్యా నీవు లేని భవనములు వద్ధయ్యా  నీతో యున్నా గుడారమే చాలయ్యా నీవుంటే బ్రతుకంతా ఆనందమే యేసయ్య  నీవు లేనిదే నాకూ ఏది వలదయ్యా నిన్ను విడిచి వెళ్ళలేనయ్యా లోకాశలు నన్ను పిలిచినా  లోకపు శ్రమలు అడ్డుగా నిలిచినా నాగటిపై చెయ్యి వేసి వెను తిరిగి చూడలేనయ్యా నా గమ్యము నీవేనని సహనముతో సాగెదనయ్యా నీవు లేని ఘనతలు నాకు వద్ధయ్య  నీ పాద సన్నిదే నాకు చాలయ్యా నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళగలను నేను యేసయ్య నా ఘనతంతయు నీవే కదా నీతోనే ఉంటానయ్యా

ఏతోడు లేని నా జీవితంలో

ఏతోడు లేని  నా జీవితంలో నా తోడు నీవై నిలిచావు దేవా (2) ఏమిచ్చినా ని ఋణం తీర్చగలనా (2) స్తుతి గాణమే నే పాడనా నా యే స్సయ్యా నా  ప్రాణమా {చ.1} నా జీవితంలో పడియున్నవేళ్లలా నా వెన్ను తట్టి  నడిపించినావే యోగ్యతే లేని నా దిన స్థితిలో       ని కృపతో నింపి నడిపించినావే【2】 ఏమిచ్చినా ని ఋణం తీర్చగలనా (2)  స్తుతి గాణమే నే పాడనా నా యే స్సయ్యా నా  ప్రాణమా                                   !!ఏతోడులేని !! {చ.2} ని వాక్కు చేత నా బ్రతుకునే మర్చి ని ఆత్మ నాలో  నింపావు దేవ నా స్థానమందు నా శిక్షన్   పొంది     ని మహిమనిచ్చి నను నిలిపినావె   【2】 ఏమిచ్చినా ని ఋణం తీర్చగలనా (2) స్తుతి గాణమే నే పాడనా నా యే స్సయ్యా నా  ప్రాణమా                                   !!ఏతోడులేని !!

ఏంతయైనా నమ్మదగినా దేవుడువునీవు యేసయ్యా

ఏంతయైనా నమ్మదగినా దేవుడువునీవు  యేసయ్యా (2 అనుదినము వాత్సల్యము (2 చూపించేదవయ్యా  (ఏంత) 1)  నీవేనా భాగమనీ నమ్మిక యుంచానుయ్యా (2 దయాళువుడవైనా రాజువని(2  నినువేదకేదనయ్యా  (ఏంత)  2) నీవువిచ్చు రక్షణకై అశతోఉన్నానుయ్యా (2 నీరిక్షణాఆధారం కలుగుననీ(2 కనీపేట్టేదనయ్యా  (ఏంత)  3) సర్వకాలం విడనాడని ప్రేమా మయుడవయా(2 భాదపేట్టినా నీ కృపనుబట్టి (2 జాలిపడెదవయ్యా  (ఏంత)

ఏ సమయమందైన ఏ స్ధలమందైనఏ స్ధితిలో నేనున్న స్తుతిపాడెదన్‌

ఏ సమయమందైన ఏ స్ధలమందైన ఏ స్ధితిలో నేనున్న స్తుతిపాడెదన్‌ ఆరాధన ఆరాధన నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన ఆరాధన ఆరాధన గొర్రెపిల్ల క్రీస్తుకే ఆరాధన చెరసాలలో నేను బంధీగా ఉన్నా సింహాల బోనులో పడవేసినా కరవు ఖడ్గము హింస ఏదైననూ మరణ శాసనమే పొంచున్నను యేసు నామమే ఆధారము కాగ యేసు రక్తమే నా విజయము పగటి ఎండలో రాత్రి వెన్నెలలో కునుకకకాపాడు యేసు దేవునికే                                       ఆరాధన నా జీవనాధారం శ్రీ యేసుడే నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే తన చేతులతో నన్ను నిర్మించెగా నా సృష్టికర్తను కొనియాడెదన్‌ యెహోవా రాఫా నన్ను స్వస్ధపరచున్‌ యెహోవా షమ్మా నాకు తోడుగా యెహోవా నిస్ని నా ధ్వజముగా అల్ఫా ఓమేగా ఆది దేవునికే ఆరాధన

ఏ పాటిదో నా జీవితంఏ లాంటిదో ఆ నా గతం

ఏ పాటిదో నా జీవితం ఏ లాంటిదో ఆ నా గతం 1 . ప్రభు యేసులో నాజీవితం      మారి పోయేగా ఆ నా గతం      నన్ను ప్రేమించిన నాకై మరణించిన      నన్ను విడిపించిన యేసుకే      ప్రభు యేసు నీకే  స్వాగతం      మారి పోయేగా ఆ నా గతం- (2)                                              (ఏ పాటిదో) 2 . ఎందుకో పుట్టానని నా బ్రతుకే  దండగని      పనికిరాని వాడనని పైకి అసలే రాలేనని     పది మంది నన్ను చూచి గేళి చేయువేళా     పనికొచ్చే పాత్రగా నన్ను చేసిన     పరిశుద్ధునిగా నన్ను మార్చి      యేసయ్య నీకే స్తోత్రమూ...     మెస్సయ్య నీకే స్తోత్రమూ...                                           (ఏ పాటిదో) 3 . అంద చెందాలు లేవని చదువు సంధ్యలే  అబ్బని- తెలివి ...

ఏ పాట పాడినా నా క్రీస్తు గానమేఏ మాటలాడినా నా క్రీస్తు నామమే

ఏ పాట పాడినా నా క్రీస్తు గానమే ఏ మాటలాడినా నా క్రీస్తు నామమే ఏ   బాట నెగినా ఆ ప్రేమ నామమే బెత్లెహెముపల్లెలో మరియకు తాను పాపడై పశువుల శాలలో నర పశుమంద నేలగా జననము నొందిన పురుషుడువీడట అదిగాంచి తలవంచి జగమే మొకారిల్లగ జరుషలేమ్ సీమలో హేరొదే తనకు శత్రువై రాతిరివెళలో మాత పితల నీడలో పయణముచేసిన ప్రియశిశుడితడు జనబాదే తన బాదై తనువే దానమివ్వగ

ఏ నీడలేని ఈ లోకంలో ఏ తోడు లేని నాజీవితంలో

ఏ నీడలేని ఈ లోకంలో  ఏ తోడు లేని నాజీవితంలో నీ నామమే క్రీస్తు నాగానము నీవే నా ప్రాణము నీవే నా ధ్యానము దివిలోన దూతాళీ కొలిచేటి వేళ భువిలోన ప్రజవళి స్తుతియించువెళ నామది లో నాగదిలో ఒంటరినై కన్నీళ్ళతో నీకై విలపించుచుంటిని కనరావనాదేవా  దయగనవా ఈ దీనునుపైన  మతిలేక నీ దారి తొలగినానులే గతిలేక ఏ దారి నలిగినానులే నాపైనా నీచూపు ప్రచరించని  చల్లని నీ నిడలో నివసింపని వినరావా నాదేవా  దయగనవా ఈ దీనునిపైనా

ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని

ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని (2) ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని (2) ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా (2) ||ఏం చేసానయ్యా|| ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా (2) ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా నిన్నే ఎదిరించానా (2) ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా (2) నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా (2) ||ఏం చేసానయ్యా|| ధనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా శ్రద్ధ నిలిపావయ్యా పోషింప జేసావయ్యా (2) ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా నా కడుపు నింపుకున్నానా (2) ||ఇప్పటికైనా || ఇల్లునిచ్చావయ్యా వాహనమునిచ్చావయ్యా భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా (2) ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా సోమరినైపోయానా (2) ||ఇప్పటికైనా ||  

ఎవరున్నరయ్యా నాకు నీవు తప్ప ఏమున్నదయ్యా భువిలో నీవు లేక

ఎవరున్నరయ్యా నాకు నీవు తప్ప ఏమున్నదయ్యా భువిలో నీవు లేక || ఎవరున్నరయ్యా ||  నా యేసయ్య.. హల్లెలూయా .. (4)  1 .నా ఆశ్రయం నీవే .. నా ఆశయం నీవే (2)  నా సర్వము యేసు నీవేగా (2) || ఎవరున్నరయ్యా ||  2. ఈ భువికి దీపం నీవే .. నా హృదిలో వెలుగు నీవే (2) అన్నింటిని వెలిగించే దీపం నీవే (2) || ఎవరున్నరయ్యా || Yevarunnarayya Naaku Neevu Tappa Emunnadayya Bhuvilo Neevu Leka || Evarunnarayya || Naa Yesayya .. Halleluyah.. (4)  1 .Naa Ashrayam Neeve .. Naa Ashayam Neeve (2)  Naa Sarvam Yesu Neevegaa (2) || Evarunnarayya ||  2. Ee Bhuviki Deepam Neeve .. Naa Hrudilo Velugu Neeve (2)  Annintini Veliginche Deepam Neeve (2) || Evarunnarayya  ||

ఎవరూ లేక ఒంటరినై అందరికి నే దూరమై

ఎవరూ లేక ఒంటరినై అందరికి నే దూరమై (2) అనాథగా నిలిచాను నువ్వు రావాలేసయ్యా (4)  స్నేహితులని నమ్మాను మోసం చేసారు బంధువులని నమ్మాను ద్రోహం చేసారు (2) దీనుడనై అంధుడనై అనాథగా నే నిలిచాను (2) నువ్వు రావాలేసయ్యా(4)  ||ఎవరు లేక||  నేనున్నాను నేనున్నానని అందరు అంటారు కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు (2) దీనుడనై అంధుడనై అనాథగా నే నిలిచాను (2) నువ్వు రావాలేసయ్యా (4)  ||ఎవరు లేక||  చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి (2) దీనుడనై అంధుడనై అనాథగా నే నిలిచాను (2) నువ్వు రావాలేసయ్యా (4)  ||ఎవరు లేక||

ఎవరు లేరు ఎవరు లేరు ఈ లోకంలో

ఎవరు లేరు ఎవరు లేరు ఈ లోకంలో నీవుతప్ప ఎవరు లేరు నా యేసయ్యా నీవు తప్పా -ఆ- నీవు తప్పా...ఆ.. నీవు తప్ప ఎవరు లేరు నా యేసయ్యా నీకే వందనమయా నీకే వందనమయా నీకే వందనమయా యేసయ్యా నీకే వందనమయా 1. కంట తడి పేట్టకని ఓదార్చితివే     కౌగిలిలో దాచుకొంటివే     కరుణతో నన్ను హత్తుకుంటివే     నీ అక్కున నను చేర్చుకుంటివే 2. భయమేలనూ అని     అభయము నిచ్చి     ధైర్యముతో నను నింపితివే     సహాయకుడా విమోచకుడా     నను నడిపించిన నా యేసయ్యా         రచన , స్వరకల్పన         శ్యాంసన్ & స్టాలిన్          9505580269

ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో

ఎవరికి ఎవరు ఈ లోకంలో  చివరికి యేసే పరలోకంలో   ఎవరెవరో ఎదురవుతుంటారు  ప్రాణానికి నా ప్రాణం అంటారు   కష్టాలలో వారు కదిలి పోతారు కరుణ గల యేసు నితో ఉంటాడు మనుషుల సాయం వ్యర్థము రా  రాజులుని నమ్మిన వ్యర్థము రా యెహోవాను ఆశ్రయించుట  ఎంత మేలు ఎంతో మేలు ధనము నీకుంటే అందరూ  వస్తారు  దరిద్రుడు వైతే దరికి ఎవరు రారు ఎవరిని నమ్మినా ఫలితము లేదురా  యేసుని నమ్మిన మోక్షం ఉందిరా  

ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా

ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా ఎలా నడువగలను ఎలా బ్రతుకగలను నీతోడు నీడా లేకుండా ॥2॥ నీ ప్రేమా వర్ణించలేనిది  నీ ప్రేమా వివరించలేనిది నీ ప్రేమా మరచిపోలేనిది నీ ప్రేమా విడిచి పోలేనిది             ॥ఎలా॥              శాశ్వత ప్రేమతొ ప్రేమించావు  } కునుకక కాపాడి రక్షించావు    }॥2॥ విడువక ఎడబాయక తోడున్నావు } సర్వకాలము నాతో ఉన్నావు         }॥2॥                                             ॥నీ ప్రేమా॥              శ్రమలలొ నన్ను వీడిపోలేదు     } దుఃఖములో నన్ను ఓదార్చావు }॥2॥ మేలులతో నన్ను తృప్తిపరిచావు   } నిత్యం నన్ను నడిపించావు           }॥2॥                                   ...

ఎన్నిక లేని నాపై ఎంత కృప చూపినావు

ఎన్నిక లేని నాపై ఎంత కృప చూపినావు   ఎల్లలు లేని ప్రేమ ఎద నిండా నింపినావు         నీకే నీకే నీకే పాదాభివందనం         నీకే నీకే నీకే స్తోత్రాభివందనం                                        // ఎన్నిక // 1. బాధల నుండి బందకము నుండి      నన్ను విమోచించినావు     ఎన్నడు తరగని ఆనందం      నాకు దయ చేసినావు     ఏమిచ్చి నీ రుణం నే తీర్చను      ఏ రీతి నిను నేను సేవించను    నీకే నీకే నీకే పాదాభివందనం     నీకే నీకే నీకే స్తోత్రాభివందనం                                        //ఎన్నిక// 2. పాపము నుండి మరణము నుండి      నన్ను తప్పించినావు     ఎవ్వరు చూపని మమకారం     నాకు రుచి చూపినావు      ఏమిచ్చి నీ రుణం నే తీర్చను    ...

ఎందుకో నన్నింతగా నీవుప్రేమించితివో దేవా

ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయ యేసయ్య నా పాపము బాప నరరూపి వైనావు నా శాపము మాప నలిగి వ్రేలాడితివి నాకు చాలిన దేవుడవు నీవే  నా స్థానములో నీవే నీ రూపము నాలో నిర్మించి యున్నావు నీ పోలిక లోనే నివశించమన్నావు నీవు నన్ను ఎన్నుకొంటివి నీ కొరకై నీ కృపలో నా మనవులు ముందె నీ మనసులో నెరవేరే నా మనుగడ ముందె నీ గ్రంథములోనుండె ఏమి అధ్బుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్

ఎంతో సుందరుడమ్మ తానునేనెంతో మురిసిపోయినాను

ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను (2)   ||ఎంతో|| దవళ వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2) ఎవరు ఆయన కిలలో  సమరూప పురుషుండు (2) అవలీలగా నతని గుర్తింపగలనమ్మా (2)                                                       ||ఎంతో|| కురులు నొక్కులు కల్గి  స్ఫుర ద్రుపి అగు విభుడు (2) మరులు మనసున నింపు మహనీయుడాతండు (2) సిరులు కురిపించెను  పరలోక తనయుండు (2) విరబూయు పరలోక షారోను విరజాజి (2)                                                  ||ఎంతో|| పాలతో కడిగిన నయనాలు కలవాడు విలువగు రతనాల వలె పొదిగిన కనులు(2) కలుషము కడిగిన కమలాల కనుదోయి (2) విలువైన చూపొసగె  వరమేరి తనయుండు (2)         ||ఎంతో|| అతడతికాంక్షానీయుండు తనయుండు అతడే నా ప్రియుడు అతడే నా ...

ఎంతో సుందర మైనదిఎంతో ఉన్నత మైనది

ఎంతో సుందర మైనది ఎంతో ఉన్నత మైనది ఎంతో ప్రశాంత మైనది నా దేశము ఎన్నో విలువలు ఉన్నది ఎన్నో కళలు కన్నది ఎన్నో మేలులు పొందినది నా ప్రియ దేశము     " 2 " I love my india.I love my india I love my india I pray for my india   " 2 " నా దేశము నా యేసు ప్రేమను  తెలుసుకోవాలనే నా ఆశ నా దేశము నా యేసు రక్తములో  కడగబడాలనే నా ఆశ      " 2 " నశియించి పోతున్న ఆత్మలను రక్షించాలని నా యేసులో ప్రతి పాపము  విడుదల పొందాలని  " 2 " I love my india.I love my india I love my india I pray for my india   " 2 " నా దేశము నా యేసు మార్గములో నడువాలనే నా ఆశ నా దేశము నా యేసు చెంతకు  చేరాలనే నా ఆశ   " 2 " నా యేసుని సువార్తను ప్రకటించాలని నా యేసుని రాజ్యములో  ప్రతి వారు ఉండాలని     " 2 " I love my india.I love my india I love my india I pray for my india   " 2 "  ఎంతో

ఎంతటి వాడను నేను యేసయ్యా

ఎంతటి వాడను నేను యేసయ్యా కొంతైనా యోగ్యుడను కానయ్యా (2) ఇంతగ నను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు (2)    ||ఎంతటి|| ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడవీవే హెచ్చించువాడవును బలమిచ్చువాడవు నీవే (2) అల్పుడను మంటి పురుగును నన్ను ప్రేమించినావు ప్రాణమును నీ సర్వమును నా కొరకై అర్పించినావు            ||ఎంతటి|| నిను వెంబడించువారిని నిజముగ సేవించువారిని నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని (2) ఎంతో ఘనపరచెదవు ఆశీర్వదించెదవు శత్రువుల కంటె ఎత్తుగా అతని తలను పైకెత్తెదవు ||ఎంతటి|| వినయముగల మనుష్యులను వర్దిల్లజేసెదవు గర్విష్టుల గర్వమునణచి గద్దె నుండి దించెదవు (2) మాదు ఆశ్రయ దుర్గమా మేమంతా నీ వారమే మా శైలము మా కేడెమా మాకున్నదంతా నీ దానమే          ||ఎంతటి||

ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యానీలా ప్రేమించేది ఎవరయ్యా

ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా నీలా ప్రేమించేది ఎవరయ్యా  2 అడగక పోయినా అక్కరలెరిగిన  2 అల్ఫా ఓమేగవు నీవె కదా  2                       || ఎంత మంచి ప్రేమ || నీ స్వాస్థ్యమైన నీ ప్రజల క్షేమముకై   2 రాజాజ్ఞను మార్చిన వాడవు నీవు 2 రాజులను మార్చిన రారాజువు 2 రాజ్యలని కూల్చిన జయశాలివి ‌2 యేసయ్యా నీ ప్రేమే మధురం   యేసయ్యా నీ కృపయే అమరం  2                       || ఎంత మంచి ప్రేమ || నీ స్వాస్థ్యమైన నీ ప్రజల మేలులకై   2 అధికారుల అహమును అణచినవాడ  2 అధికారులను మార్చిన వాడా   2 యేసయ్యా నీ ప్రేమే మధురం   యేసయ్యా నీ కృపయే అమరం  2                       || ఎంత మంచి ప్రేమ || నీ స్వాస్థ్యమైన నీ ప్రజల కోసమై  2 ఆకాశమునుండి మన్నాను పంపావు  2 బండను చీల్చిన బలవంతుడా  మారా మధురంగా మార్చినవాడా  2 యేసయ్యా నీ ప్రేమే మధురం   యేసయ్యా నీ కృపయే అమరం...

ఎంత మంచి దేవుడవయ్యాఎంత మంచి దేవుడవేసయ్యా

ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా (2)  ||ఎంత|| ఘోరపాపినైన నేనూ దూరంగాపారిపోగా(2) నీ ప్రేమతో నను క్షమియించి నను హత్తుకొన్నావయ్యా (2)       ||ఎంత|| నా కున్న వారందరు  నను విడచిపోయినను (2) ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ నను నీవు విడువలేదయ్యా (2)      ||ఎంత|| నీవు లేకుండ నేనూ   ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2) నీతో కూడా ఈ లోకం నుండీ పరలోకం చేరెదనేసయ్యా (2)      ||ఎంత||

ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ

ఎడబాయని నీ కృప  నను విడువదు ఎన్నటికీ ||2|| యేసయ్యా నీ ప్రేమానురాగం  నను కాయును అను క్షణం ||2|| ||ఎడ|| శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో  కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో   ||2|| అర్ధమే కానీ ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా ||2|| కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి  ||2||  ||ఎడ|| విశ్వాస పోరాటములో ఎదురాయె శోధనలు  లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో ||2|| దుష్టుల క్షేమము నే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా  ||2|| దీర్ఘ శాంతము గలదేవా  నా చేయి విడువక నడిపించితివి||2||||ఎడ|| నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో  నా బలమును చుసుకొని నిరాశ చెందితిని2 భారమైన ఈ సేవను  ఇక చేయలేనని అనుకొనగా  ||2|| ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ||2|| ||ఎడ||

ఎటువైపు నీ పయనమో నేస్తమాహోరుగాలిలో చిరుదీపమా

ఎటువైపు నీ పయనమో నేస్తమా హోరుగాలిలో చిరుదీపమా    "2" ఇటువైపు మరణం అటువైపు జీవం "2" నీ గమ్యం ఏమిటో గమనించుకొనుమా "2"                               శత్రువగు సాతాను మిత్రునివలే చేరి నీ జీవితాన్ని కూల్చియున్నదా   "2" నిజ సేహితుడైన యేసయ్య చేరుమా నీ కొరకై తన ప్రాణం అర్పించెనే  "2"                             కారుచీకటిలో కానరాని మార్గమున తిరుగాడుచుంటివని పరికించుకొనవా "2" నేనే మార్గం సత్యం జీవమని...... ఆశ్చర్యమైన వెలుగు యేసే అని తెలుసుకో "2"                               ఎండమావి లాంటి లోకములో నీవు ఆశలన్ని ఆవిరై అలమటించువేళ  "2" నిత్యజీవ ఊటయైన యేసయ్య చేరితే.... జీవజల ఊటలు ప్రవహింపజేయుడా  "2"                            

ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి

ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్ధరొక్కటగుటేమిటో ఇదిదేవుని సంకల్పం సృష్టిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరికొరకు ఒకరు బ్రతికెదరు పెళ్ళినాటి నుండి తల్లి దండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో గతకాలకీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు పెళ్ళినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో ఫలియించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధిపొందెదరు పెళ్ళినాటినుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో

ఊహించలేనయ్య వివరించలేనయ్యా

ఊహించలేనయ్య వివరించలేనయ్యా  ఎనలేని నీ ప్రేమను నా జీవితాంతం ఆ ప్రేమలోనే తరియించు వరమే దొరికెను ||ఊహించ|| 1. నా మనసు వేదనలో – నాకున్న శోధనలో ఉల్లాసమే పంచెను ఓ మధుర భావనలో – తుదిలేని లాలనలో మధురామృతమునే నింపెను (2) అనాథయిన నను వెదకెను ప్రధానులలో ఉంచెను          ||ఊహించ|| 2. నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలో నీ ప్రేమ రుజువై నిలిచెను వెలలేని త్యాగముతో – అనురాగ బోధలతో నా హృదయమే కరిగెను ఇది నీ ప్రేమకే సాధ్యము వివరించుట నాకసాధ్యము          ||ఊహించ||

ఊహలకందనిప్రేమను కలిగిన ప్రేమాస్వరూపుడు

ఊహలకందని ప్రేమను కలిగిన  ప్రేమాస్వరూపుడు ఱేడు లోకానికి రక్షకుడైనాడు యేసయ్య పరిశుద్ధుడు నా దేవుడు కరుణశీలుడు నా దేవుడు సత్యమైన దేవుడు                      "ఊహాలకందని" 1.త్యాగం అనురాగం యేసయ్యకే సాధ్యము విలువైన తన రక్తం ఇచ్చెను మనకోసము "2" ఇటువంటి దేవుడు  లోకాన లేరేవ్వరూ"2" ఈ లోకమును రక్షించుటకై చిందించెను తన రక్తము చిందించెను తన రక్తము                  "ఊహాలకందని" 2.యేసే జీవాహారం మన జీవనాధారము తన రమ్యకృపతోడ  బలపరిచే నజరేయుడు                           "2"  ఉన్నతుని ప్రేమయే  నన్నుఇల బ్రతికించెను"2"  నిర్మలమైన మనసునుకలిగి  స్తుతి గానము చేసెదను  స్తుతి గానము చేసెదను            " ఊహాలకందని"

ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ

ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ  వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ  తరాలు ఎన్ని మారినా యుగాలు ఎన్ని గడిచినా జగన  మారనిది యేసు ప్రేమ  తరాలు ఎన్ని మారినా యుగాలు ఎన్ని గడిచినా జగన మారనిది యేసు ప్రేమ ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమ  ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ  ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ   ఊహకు  అందని ప్రేమ నా యేసు ప్రేమ మేలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ  :మనిషిని మనిషి ప్రేమించుటకు స్వార్థం మూలకారణం దేవా  నీవు ప్రేమించుటకు నీ కృపయే కారణం  మనిషిని మనిషి ప్రేమించుటకు  స్వార్థం మూలకారణం  దేవా నీవు ప్రేమించుటకు నీ కృపయే కారణం  మనుషులు మారినా మతాలు మారినా బంధాలు వీగిన యేసు ప్రేమ మారదు మనుషులు మారినా  మతాలు మారిన బంధాలువీగిన యేసు ప్రేమ మారదు  ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమ  ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ  ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ వేలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ  జీవితమంతా పోరాటం యేదో తెలియని ఆరాటం  నిత్యము ప్రేమకై వెతకటం దొరకక పోతే  సంకటం   జీవితమంతా పోరాటం యేదో తె...

ఉన్నాడు దేవుడు నాకు తోడువిడనాడ డేన్నాడు యడబాయడు

ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడ డేన్నాడు యడబాయడు  (2) కష్టాలలోనా నష్టాలలోనా వెదనలోన శోదనలోన గాఢంధకారములో సంచరించినా కన్నీటి లోయలో మునిగితెలినా  (2) కరుణాలేని లోకము కాదన్నాను  (2) కన్నీరు తుడుచును నన్ను కొన్నవాడు యెహోవా సన్నీధిలో నివసింతును చిరకాలమాయనతో సంతసింతును (2) కృపా మధుర క్షేమములే నా వెంటేఉండును బ్రతుకు కాలమంతయు హర్షీంతును హాల్లేలూయా హాల్లేలూయా  హాల్లేలూయా హాల్లేలూయా

ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే

ఈ స్థితిలో ఉన్నానంటే  ఇంకా బ్రతికున్నానంటే నీ కృప నీకృప నీ కృప ఇది నీ కృప కష్టకాలమందు నా చెంతచెరి  కన్నీళ్లుతుడచి నన్నాదరించినది " నీ కృప" ముర్ఖులగు ఈ తరముకు నన్ను వెరుచేసి పరలోక పౌరత్వం నాకు ఇచ్చినది                                                  "నీ కృప" దేవదుతలే చేయని ఈ దివ్య సేవను అల్పుడనైన నాకు అప్పగించినది" నీ కృప"

ఈ స్తుతి నీకే మా యేసు దేవామనసారా నిన్నే సేవింతుము

ఈ స్తుతి నీకే మా యేసు దేవా మనసారా నిన్నే సేవింతుము – (2) పరలోక దూతాలి స్తోత్రాలతోనే` మా స్తోత్ర గానాలు గైకొనుమా (2)                                                 ||ఈ స్తుతి|| జగతికి పునాది నీవని మాలోన ఊపిరి నీదేనని (2) మా పోషకుడవు నీవేనని మా కాపరివి నీవేనని (2) మా హృదయాలలో ఉండాలని నీ సాక్షిగా మేము బ్రతకాలని                                            ||ఈ స్తుతి|| మనసారా నీ దరి చేరగా మాకెంతో సంతోషమాయెగా (2) హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా (2) నీ మధుర ప్రేమను చాటాలని నీ జీవ బాటలో నడవాలని         ||ఈ స్తుతి

ఈ జీవితం విలువైనదినరులారా రండని సెలవైనది

ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది (2) సిద్ధపడినావా చివరి యాత్రకు (2) యుగయుగాలు దేవునితో ఉండుటకు నీవుండుటకు   ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది  దేవుని సెలవైనది    సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2) పోతున్నవారిని నువు చుచుటలేదా (2) బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2)    ||ఈ జీవితం|| మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2) చిన్న పెద్ద తేడా లేదు మరణానికి (2) కులమతాలు అడ్డం కాదు స్మశానానికి (2)    ||ఈ జీవితం|| పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పుచెందు మరణానికి ముందు (2) యేసు రక్తమే నీ పాపానికి మందు (2) కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు (2)    ||ఈ జీవితం||

ఇద్దరో క్కటిగ మారేటీ మధురమైన క్షణము

ఇద్దరో క్కటిగ మారేటీ మధురమైన క్షణము దేవుని చిత్తము లో పెనవేసిన  నిత్య అనుబంధము/2/ వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆసందడి/2/ ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి/2/ అవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించును సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించెను/2/                         ఏక మనసుతో ముందుకు సాగే జీవ వృక్షముకు మార్గము ఎరిగి/2/ సొంత తెలివిని మానుకుని  దేవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆపయనం  దేవుని కొరకై ప్రతి క్షణం/2/ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరునుకుంటూ/2/ క్రీస్తు ప్రేమను పంచాలి  సాక్షములను చాటించాలి  సంతానమును పొందు కొని తండ్రి రాజ్యమునకు చేర్చాలి/2/